తిరుపతి ఆసుపత్రిలో ఆగని చిన్నారుల మరణాలు..
విషయాన్నికొస్తే.. తిరుపతి ప్రముఖ ఆసుపత్రిలో వరుసగా చిన్నారుల మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి..ప్రసూతి ఆస్పత్రిలో వరుసగా పసి బిడ్డలు మరణాలు సంభవిస్తున్నాయి. ఒడిలోని బిడ్డలు చని పోవడంతో కన్న తల్లుల కడుపు కోతల భాధలు రెట్టింపు అవుతూన్నాయి. శిశు మరణ మృదంగాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఆస్పత్రికి బిడ్డలను తీసుకు రావాలంటేనే తల్లి దండ్రులు హడలిపోతున్నారు. కేవలం వారం రోజుల్లోనే తొమ్మిది మంది శిశువులు మరణించారు. ఈ ఘటన కారణంగా ప్రసూతి ఆసుపత్రికి పిల్లలను తీసుకొని వెళ్ళాలంటే జనాలు భయంతో వణికిపోతున్నారు..
తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో ఏకంగా 14మంది పసిబిడ్డలు మృతి చెందారు. కేవలం వారం రోజుల్లో 9మంది మృత్యువాత పడటంపై కుటుంబ సంక్షేమ శాఖ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..చిన్నారుల మరణాల వెనుక ఉన్న అసలు విషయాన్ని కనిపెట్టడం కోసం స్పెషల్ అధికారులను కూడా నియమించారు. రుయా చిన్నపిల్లల ఆస్పత్రి లోనూ శిశు మరణాలు కొనసాగుతుండటం పై ప్రజల తీవ్ర వ్యతిరేకత కొనసాగుతుంది. దీంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చెస్తున్నారు. కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అడిషనల్ డైరెక్టర్ అనిల్ త్వరలోనే పూర్తీ వివరాలను తెలుసుకొనే పనిలో వున్నారు.