దారుణం : కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి?

praveen
ప్రతి ఒక్కరూ నాగరిక సమాజం లో అడుగు పెడుతున్నారు.. సరికొత్త టెక్నాలజీని ఉపయోగించుకుని అద్భుతాలను సృష్టిస్తున్నారు. ఇలా మనిషి జీవన శైలి లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. కానీ అటు ఆడ పిల్లలకు రక్షణ మాత్రం రోజురోజుకు ప్రశ్నార్థకం గానే మారి పోతుంది. నాగరిక సమాజం లో కూడా మంచి వాళ్లమనే ముసుగు వేసుకున్న మానవ మృగాలు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. కనుచూపు మేరలో  ఆడపిల్ల కనిపించింది అంటే చాలు దారుణం గా అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు సభ్య సమాజాన్ని సిగ్గుపడేలా చేస్తూ ఉన్నాయి.  ఇలాంటి తరహా ఘటనలు  అటు ప్రతి ఒక్కరిని భయాందోళనకు గురిచేస్తున్నాయి అని చెప్పాలి.



 దీంతో నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటన చూసిన తర్వాత ఆడపిల్ల ఇల్లు దాటి కాలు బయట పెట్టాలంటే భయపడే పరిస్థితి నేటి రోజుల్లో నెలకొంది. ఏ వైపు నుంచి కామాంధులు దాడి చేస్తారో అని అనుక్షణం భయపడుతూనే బ్రతకాల్సిన పరిస్థితి ప్రస్తుత రోజుల్లో ఏర్పడింది అని చెప్పాలి. అయితే అటు ఆడ పిల్లల పై అత్యాచారం చేసిన వారిని శిక్షించేందుకు ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఇక్కడ ఇలాంటి దారుణ ఘటన తెరమీదికి వచ్చింది. యువతికి మత్తుమందు ఇచ్చినా కామాంధులు ఆ యువతిపై దారుణంగా అత్యాచారం చేసిన ఘటన సంచలనం గా మారిపోయింది.



 కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి యువతి పై మూడు రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడి రాక్షసుల్లా ప్రవర్తించారు కామాంధులు. అత్యాచారం చేయడమే కాదు దారుణంగా ఆ యువతిపై దాడి కూడా చేశారు. రోజుల తర్వాత ఆ యువతి బంధువులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన యువతికి వైద్య చికిత్స అందిస్తున్నారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: