ఆడుకుంటూ అడవికి చిన్నారి.. చివరికి?
కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఒక చిన్నారి ఇంటి పరిసరాల్లో ఆడుకోవడం కాదు. ఇలా ఆడుకుంటూ ఆడుకుంటూ అడవికి చేరింది. దీంతో తమ కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. చుట్టుపక్కల వెతికినా కనిపించలేదు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రెండు రోజుల క్రితం అదృశ్యమైన నాలుగేళ్ల చిన్నారి ఇటీవలే పోలీసులు అడవిలో గురించి ఇంటికి తీసుకువచ్చారు. చిత్తూరు జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
కుప్పం మండలం కంగుంది పంచాయతీ శివారు నక్కలగుట్ట గ్రామానికి చెందిన మనీ, కవితలకు నాలుగేళ్ల జోషిక అనే కుమార్తె ఉంది. ఇటీవల శనివారం సాయంత్రం సమయంలో ఇంటి బయట ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల గాలించినా ఆచూకీ దొరకలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. పలు బృందాలుగా ఏర్పడిన పోలీసులు రాత్రంతా వెతకడం ప్రారంభించారు. ఇక చుట్టుపక్కల ఉన్న నాలుగు నీటి కుంటలలో ఉన్న నీటిని కూడా తొలగించారు. డాగ్ స్క్వాడ్ కు బాలికల దుస్తులు చూపగా ఇక ఆ జాగిలం అటవీ ప్రాంతంలో వెళ్ళి ఆగింది. దీంతో ఇక అనుమానం వచ్చిన పోలీసులు అటవీ ప్రాంతంలో గాలించగా అంబాపురం అటవీ ప్రాంతంలో పాప ఆచూకి గుర్తించారు. అయితే నాలుగేళ్ల పాప అంత ధైర్యతో 36 గంటలపాటు అడవిలో ఎలా గడిపిందో పోలీసులు ఆశ్చర్యపోయారు. కూతురు ఆచూకీ లభించడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు..