అయ్యో దేవుడా.. నలుగురి ప్రాణం పోయిందే?

praveen
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉన్నాయి అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో సామాన్య ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు.  భారీ అకాల వర్షాల నేపథ్యంలో మళ్లీ ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు  ఆందోళనలో మునిగిపోతున్న పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే సరిగ్గా పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షం పడితే పూర్తిగా పంట నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

 ఈ క్రమంలోనే ఇక వర్షం కారణంగా ఎక్కడ నష్టపోతామో అని అనుక్షణం భయపడుతూ బ్రతుకుతున్నారు రైతులు. అయితే ఇప్పటికే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి ఎంతో మంది ప్రాణాలు తీస్తుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పడుతున్న అకాల వర్షం కూడా ఎంతోమంది ప్రాణాలు పోవడానికి కారణం అవుతూ ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కారణంగా పలు చోట్ల పిడుగు పడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్. ఈ క్రమంలోనే ఇక బహిరంగ ప్రదేశాలు లేదా వ్యవసాయ పొలాల్లో ఉంటున్న వారు చివరికి పిడుగుపాటు బారిన పడుతూ మృతి చెందుతున్న ఘటనలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూ ఉన్నాయి.

 ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన జరిగింది. కర్నూలు జిల్లా లో అకాల వర్షం తో పంట నష్టం వాటిల్లడమె కాదు.. పిడుగుపాటు కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆదోని లో పిడుగుపాటు కారణంగా ఇద్దరు మహిళలు చనిపోయారు. హోళగుంద పండవగాళ్లు లో మరో ఇద్దరు పిడుగుపాటుతో మృతి చెందారు అని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కారణంగా పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు ఎవరూ కూడా వర్షం సమయంలో బయట తిరగవద్దు అంటూ అటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు అన్న విషయం తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: