ఆశీర్వదిస్తానని చెప్పి హత్య చేసిన పూజారి..ఎందుకంటే?

Satvika
ఆర్థిక ఇబ్బందులు మనుషులను ఎలా మారుస్తాయో చెప్పలేము.. కోటి విద్యలు కూటి కొరకే.. అన్న విధంగా జనాలు రెక్కలు ముక్కలు చేసుకొని పొట్ట నింపుకుంటున్నారు.. చెస్తున్న పని వల్ల డబ్బులు సరిపోక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న వాళ్ళను చాలా మందిని మనం చూసే ఉంటాము. కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం దొంగతనాలు చేయడానికి, లేదా హత్యలు చేయడానికి కూడా వెనకడుగు వేయడం లేదు.. ఇప్పుడు కూడా అలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది.. ఓ గుడి పంతులు భక్థురాలి ఒంటి పై ఉన్న నగల పై కన్నెసాడు.. ఆ నగలు దొరికితే తన కుటుంబ కష్టాలు పోతాయని భావించాడు.


ఆమెకు ఆశీర్వాదం ఇస్తానని చెప్పి తల పై బలంగా ఇనుప రాడ్డు తో కొట్టి హత్య చేశాడు.. ఆ తర్వాత శవాన్ని మాయం చేశాడు.. ఆమె కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసిటివి పుటేజ్ ను పరిసిలించి ఆమె గుడి లోనే మాయం అయ్యిందని భావించి పూజారిని తమ స్తైల్లొ విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది.. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఇలా చెసానని చెప్పడంతో అందరు షాక్ అయ్యారు..


వివరాల్లొకి వెళితే.. మల్కాజిగిరి ఠాణా పరిధిలోని విష్ణుపురి ఎక్స్‌టెన్షన్‌ కాలనీలో మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు..నగలపై ఆశతో ఆలయ అర్చకుడే ఈ దారుణానికి తెగబడినట్టు నిర్ధారించారు.. నగలను కొన్న వ్యాపారిని కూడా పోలీసులు అదుపులో కి తీసుకొని విచారించారు.ఆమె కోసం గాలిస్తున్న పోలీసుల కు గురువారం ఉదయం కాలనీ సమీపంలోని దేవాలయం వెనుక మృతదేహం కనిపించింది. ఒంటిపై నగలు లేకపోవడం తో ఆభరణా ల కోసమే హత్య చేసినట్టుగా పోలీసులు భావించి ఆ కోణం లో దర్యాప్తు ప్రారంభించారు.. ఆమెను హత్య చేసి గుడిని శుభ్రం చేశాడని తెలుసుకున్నారు.నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: