నిమ్మకాయ కోసం.. కోడలిని చంపిన అత్త?
కోడలిపై అత్తింటి వారు దాడి చేసి హత్య చేసే పరిస్థితులను తీసుకువచ్చింది. చెట్టు నుంచి ఒక నిమ్మకాయ కోసి నందుకు దారుణంగా హతమార్చిన ఘటన బీహార్లోని ఈస్ట్ చంపారాన్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. సౌదదానో పోలీస్ స్టేషన్ పరిధిలోని చైనా పూర్ గ్రామానికి చెందిన సునీల్ భైతా, కాజల్ దేవి భార్య భర్తలు. అయితే సునీల్, ఆయన తండ్రి ఉపాధి నిమిత్తం వేరే ఒక రాష్ట్రానికి వెళ్లి అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండేవారు. ఇక కాజల్ తన అత్త మరదళ్ల తో పాటే నివసిస్తూ ఉండేది. కాగా వీరి ఇంటి పెరట్లో ఒక నిమ్మకాయ చెట్టు ఉంది. ఇక ఆ చెట్టుకు నిమ్మకాయలు చాలానే కాసాయ్. ఇటీవల ఉదయం సమయంలో కాజల్ ఆ చెట్టు నుంచి ఒక నిమ్మకాయ కోసింది.
ఇది గమనించిన మరదలు ఈ విషయాన్ని తమ తల్లికి చెప్పారు. దీంతో కోపంతో తన అనుమతి లేకుండా నిమ్మకాయ ఎందుకు కోసావ్ అంటూ కోడలితో గొడవ పెట్టుకుంది అత్తా. కోడలు కూడా ఎదురు తిరిగింది. దీంతో తనకు ఎదురు చెబుతావా అంటూ రెచ్చిపోయిన అత్త ఇద్దరు కూతుర్లతో కొడలిపై దాడి చేసింది. దీంతో మహిళ మెడకు తాడు ను బిగించి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే కాజల్ అత్త ఆడపడుచులు అక్కడి నుంచి పారిపోయారు. మృతురాలి తలతో పాటు మెడపై గాయాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..