ఛీ ఛీ.. ప్రసవానికి వచ్చిన మహిళపై అత్యాచారయత్నం?
మహిళలపై అత్యాచారం చేసిన వారిని శిక్షించేందుకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకువచ్చిన.. ఇక పోలీసులు ఎన్ కౌంటర్లు చేసిన ఎందుకో కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. వెరసి ఒంటరిగా ఆడపిల్ల కనిపించింది అంటే చాలు మగాడిలో ఉన్న మృగాడు బయటికి వచ్చి పశువుల మీద పడి అత్యాచారం చేస్తున్నాడు. దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆడపిల్ల క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుందా లేదా అని ప్రతి ఆడపిల్ల తండ్రి భయపడుతూనే బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది అని చెప్పాలి.
ఏకంగా భద్రాచలం ప్రభుత్వాసుపత్రి లో సిబ్బంది ఓ మహిళ పై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడూ. ప్రసవం కోసం వచ్చిన మహిళపై ఆస్పత్రి లో పనిచేసే లాల్ ఖాన్ అనే వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన సంచలనం గా మారి పోయింది. సదరు మహిళను ఆపరేషన్ థియేటర్ కు తీసుకు వెళ్లిన సదరు లాల్ ఖాన్ మత్తు మందు ఇచ్చి లైంగికదాడికి యత్నించాడు. గమనించిన ఇబ్బంది లోని మరో వ్యక్తి అతడిని అడ్డుకున్నాడు. ఈ ఘటన కాస్త సంచలనం గా మారి పోయింది. దీంతో సదరు ఆసుపత్రికి వెళ్లాలంటేనే మహిళలు భయపడుతున్న పరిస్థితి నెలకొంది..