పోలీస్ పైనే కేసు.. ఇంతకి ఏం చేశాడంటే?

praveen
పోలీసులంటే ప్రజలకు రక్షణ కల్పించాలి. ఎలాంటి సమస్య వచ్చినా నేనున్నాను అంటూ భరోసా ఇవ్వాలి. అంతే కాకుండా న్యాయం వైపు నిలబడి అందరికీ ఆదర్శంగా నిలవాలి. అయితే ఇటీవలి కాలంలో వరకట్న వేధింపులు మహిళలకు ఎక్కువైపోతున్న నేపథ్యంలో  ఎంతో మంది మహిళలకు ధైర్యం చెబుతూ సమస్యలను పరిష్కరిస్తూ భరోసాగా నిలుస్తున్నారు పోలీసులు. అయితే ఇక్కడొక పోలీసులు మాత్రం వరకట్న వేధింపులు బాధితులకు ధైర్యం చెప్పడం కాదు అతనే వరకట్నం కావాలంటే భార్యను వేధించడం మొదలుపెట్టాడు.

 కేవలం వివాహం జరిగిన రెండు నెలలకే అదనపు కట్నం కావాలంటూ ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి భార్యని వేధించడం మొదలుపెట్టాడు. ఇక ఇది మళ్లీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. ఇక ఇటీవల విలేకరుల సమావేశంలో మాట్లాడింది బాధితురాలు. మంగళగిరి ఆత్మకూరు  చెందిన మహిళ తన చిన్నతనంలోనే చనిపోవడంతో ఇక తల్లి టైలరింగ్ చేస్తూ సదరు మహిళను ఫిజియోథెరపీ చదివించింది. 2019లో మంగళగిరిలో శిక్షణ ఎస్ఐ గా వినోద్ కుమార్ తో ఆమెకు  పరిచయం ఏర్పడగా మూడేళ్లపాటు ఎంతో సన్నిహితంగా ఉన్నార.
 ఈ క్రమం లోనే 12 లక్షల నగదు బంగారం నిర్మాణానికి 6 లక్షలు ఇతర ఖర్చులకు ఎనిమిది లక్షలు ఇలా ఇస్తూ వచ్చింది సదరు బాధితురాలు.  2021లో పెద్దల సమక్షం లో పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ళ వరకు అంతా సవ్యంగానే నడిచింది. ఉద్యోగం మానేయాలంటూ ఒత్తిడి తీసుకువచ్చి ఉద్యోగం మానేసేలా చేసాడు. చివరికి అదనపు కట్నం కోసం వేధించడం మొదలు పెట్టాడు. ఈ విషయం పై పోలీసులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఇక తనను ని చంపడానికి ప్రయత్నించాడు. నీకు  ఎవరు లేరు ఒంటరిదానివి నన్ను ఏం చేయగలవు అంటూ ధైర్యం పనులకు పాల్పడుతున్నాడు అంటు  పోలీసులకు ఫిర్యాదు చేసింది సదరు మహిళ.  ఇక తనకు న్యాయం చేయాలంటూ కోరుతుంది సదరు బాధితులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: