ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. అందరూ మైనర్లే?

praveen
ఈ సభ్య సమాజం తీరు ఎటు పోతుంది. ఈ సృష్టికి మూలమైన ఆడపిల్లకు ఎక్కడా రక్షణ లేదా.. ఆడపిల్ల ప్రతిక్షణం భయపడుతూ బ్రతకాల్సిందేనా అనే ప్రశ్నలు ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో తలెత్తుతూ ఉన్నాయ్. ఎందుకంటే నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు అంత దారుణంగా ఉన్నాయి అని చెప్పాలి. ఆడపిల్ల కనిపించింది అంటే చాలు దారుణంగా పశువుల్లా మీద పడిపోయి అత్యాచారాలు చేస్తున్న ఘటనలే నేటి సభ్య సమాజంలో ఎక్కువగా కనిపిస్తున్నాయ్. దీంతో ఆడపిల్ల ప్రతిక్షణం భయపడుతూనే బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అర్ధరాత్రి ఆడది రోడ్డుపై ధైర్యంగా తిరిగినప్పుడే దేశానికి అసలైన స్వాతంత్రం వచ్చింది అని గాంధీ గారు చెప్పారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అర్ధరాత్రి దేవుడెరుగు పట్టపగలు కూడా ఒంటరిగా ఆడపిల్ల ఎక్కడ తిరగలేని పరిస్థితి ఏర్పడింది.


 ఇంటి నుంచి కాలు బయట పెడితే చాలు కామాంధులు అత్యాచారాలు చేస్తూనే ఉన్నారు. మొన్నటి వరకు కేవలం బయట వాళ్ళు మాత్రమే ఆడపిల్లలపై అత్యాచారాలు చేస్తే ఇటీవల కాలంలో మానవ సంబంధాలను మరిచిపోతున్న సొంత వారు సైతం అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు అందరిని మరింత భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఆరేళ్ల బాలికపై నలుగురు బాలురు ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  ఖుషియార్ పూర్  జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.


 దాదాపు ఏడాదిగా నలుగురు బాలురు 6 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడుతూ ఉన్నారు.  ఇక ఇటీవల వేధింపులు తట్టుకోలేక పోయిన బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక వెంటనే తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కాగా పోలీసులు పోక్సో చట్టం కింద నలుగురిపై కేసు నమోదు చేశారు. కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక మరో బాలుడు పరారీలో ఉన్నట్లు గుర్తించి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: