తల్లితో ఎఫైర్.. మర్మాంగం కోసిన కూతురు?
కానీ ఇప్పటికీ కూడా ఎంతోమంది ఆడపిల్లలు చిన్న చిన్న సమస్యలకు భయపడిపోతున్నారు. ఎవరైనా వేధింపులకు పాల్పడితే రక్షించడానికి ఎవరైనా వస్తే బాగుండు అని కోరుకుంటున్నారు తప్ప తమని తాము రక్షించుకోవడానికి మాత్రం ప్రయత్నించలేదు. కానీ కొంతమంది మాత్రం అపర కాళిలా మారిపోతున్నారు. తమ పట్ల మాత్రమే కాదు తమ కుటుంబం పట్ల ఎవరైనా అసభ్యంగా వ్యవహరిస్తే కాళికా దేవి అవతారం ఎత్తుతున్నారు. ఇక్కడ ఓ యువతి ఇలాంటిదే చేసింది.
ఏకంగా తల్లి తో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి మర్మాంగాలను కోసేసింది యువతి. ఈ ఘటన గుంటూరు లో వెలుగు లోకి వచ్చింది. తెనాలి ఐతానగర్ లో వెలుగు చూసిన ఈ ఘటన అందరినీ అవాక్కయ్యేలా చేసింది. తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి మర్మాంగాలను కుమార్తె బ్లేడుతో కోసింది. నిన్న రాత్రి మద్యం తాగి వచ్చిన రామచంద్రారెడ్డి అనే వ్యక్తి తల్లితో ఉన్న సమయంలో కుమార్తె చూసింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయింది. చివరికి ఈ ఘాతుకానికి పాల్పడింది. అయితే ఈ దాడిలో ఆ యువతికి ఓ యువకుడు సహకరించినట్లు తెలుస్తోంది. కాగా స్థానికులు బాధితుడిని సమీప ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది అన్నది తెలుస్తుంది..