ప్రేమ పెళ్లి.. కానీ భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడూ?

praveen
ఇటీవలి కాలంలో మనుషులు మానవ బంధాలకు కాస్తయినా విలువ ఇవ్వడం లేదు. ప్రేమించిన బంధానికి కట్టుకున్న బంధానికి విలువ ఇవ్వకుండా చివరికి పరాయి వ్యక్తుల మోజులో పడి నీచమైన  పనులు చేస్తూ ఉన్నారు. ఇలా రోజు రోజుకు వెలుగు లోకి వస్తున్న ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి అని చెప్పడంలో అతి శయోక్తి లేదు. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది. ఇద్దరూ ఒకరిని ఒకరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు.


 ఉద్యోగం రీత్యా ప్రస్తుతం వేర్వేరు గా ఉంటున్నారు. కానీ ఎడబాటును తట్టుకోలేక పోయిన సదరు యువతి చివరికి అక్రమ సంబంధం వైపు మొగ్గు చూపింది. భార్యపై అనుమానంతో పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ జరిపించాడు భర్త. అయితే ఇక అనుమానించడం కాదు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని నిరూపించాలని భార్య ఆమె తల్లి తో పాటు పెద్ద మనుషులు సూచించారు. దీంతో భార్య పై నిఘా పెట్టాడు భర్త. చివరికి భార్య అక్రమ సంబంధాన్ని రెడ్హ్యాండెడ్గా బయటపెట్టాడు.


 ఘటన ములుగు జిల్లా లో వెలుగు లోకి వచ్చింది. దొడ్ల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న సుమలత.. చర్ల కార్యదర్శిగా పనిచేసే పురుషోత్తం ప్రేమించుకున్నారు. ఎనిమిదేళ్ల క్రితం పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇక ఉద్యోగం రీత్యా సుమలత చిన్న బోయిన పల్లి లో ఇల్లు అద్దెకి తీసుకుని ఉంటే పురుషోత్తం చర్లలో ఉంటున్నాడు. అయితే ఇటీవలే భార్య తీరు తో అనుమానం పెంచుకున్నాడు పురుషోత్తం. భర్త దూరంగా ఉండటంతో తన ఇంటర్ క్లాస్మేట్ లింగరాజు తో సుమలత సన్నిహితంగా మెలిగటం మొదలు పెట్టింది.  దీంతో ఇక భార్య పై నిఘా పెట్టి ఓ రోజు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడూ. గ్రామ పెద్దలు సుమలత కుటుంబ సభ్యుల సమక్షంలో వారిని పోలీసులకు అప్పగించినట్లు భర్త పురుషోత్తం తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: