తండ్రి ఫోన్ కి మెసేజ్.. తెరిచి చూస్తే కూతురు నగ్న ఫోటోలు.. చివరికి?

praveen
ప్రేమ ఒక మధురానుభూతి.. రెండు మనసుల మధ్య క్షణ కాల వ్యవధిలో పుట్టె రెండక్షరాల ప్రేమ జీవితాంతం ఎంతో సంతోషంగా ఉంటాము అనే నమ్మకాన్ని కలుగ చేస్తూ ఉంటుంది. అందుకే ప్రేమను గెలిపించుకోవడానికి ఎంతోమంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం ప్రేమ అనేది మోసానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. మోసం చేయాలనే ఆలోచన మనసులో ఉన్న పైపైకి ప్రేమ నటిస్తూ అవసరాలు తీర్చుకుంటున్నారు వారే నేటి రోజుల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. నిజాయితీగా ప్రేమించి ప్రేమను గెలిపించుకోవడానికి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటున్న వారి కంటే.. ప్రేమిస్తున్నాను అంటూ వెంట పడి పెళ్లి చేసుకుంటాను అని మాయమాటలు చెప్పి ఆర్థికంగా మానసికంగా శారీరకంగా అవసరాలు తీర్చుకుని నడిరోడ్డుమీద వదిలేస్తున్నా మోసగాళ్లే ఎక్కువగా తారసపడుతున్నారు.


 ఇలా ఇటీవలి కాలంలో ప్రేమ లో పడి మోసపోతున్న యువతుల సంఖ్య కూడా పెరిగిపోతూనే ఉంది అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ప్రేమ పేరుతో యువకుడు యువతిని నమ్మించాడు. అవసరాలు తీర్చుకుని ఆ తర్వాత ముఖం చాటేశాడు. దీంతో ఇక పెళ్లికి నిరాకరించిన ప్రియుడి పై పోలీసులకు ఫిర్యాదు చేసింది యువతి. అయితే అప్పటికే ప్రియురాలిని నమ్మించి నగ్న ఫోటోలను సేకరించినా సదరు యువకుడు చివరికి ఆ ఫోటోలను నేరుగా యువతి తండ్రి మొబైల్ కి పంపాడు.. దీంతో ఇక  ఫోటోలు చూసి ఒక్క సారిగా షాక్ లో మునిగిపోయాడు ఆ తండ్రి.

 గుండె బద్దలయినంత పని అయింది. దీంతో వెంటనే పోలీసులను ఆశ్రయించిన తండ్రి ఫిర్యాదు చేశాడు.  ఈ ఘటన విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం లో వెలుగులోకి వచ్చింది. యువతి గ్రామ సచివాలయంలో మహిళా పోలీస్ గా పనిచేస్తూ ఉంటుంది. ఆమె ప్రియుడు రెడ్డి నవీన్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా పని చేస్తూ ఉన్నాడు.  కాగా ఇటీవల యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు రెడ్డి నవీన్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: