భార్యకు చీర కట్టుకోవడం రాదని.. ఎంత పని చేసాడు?
ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది అన్న విషయం అర్థమవుతుంది. తన భార్యకు చీర కట్టుకోవడం రాదు అనే కారణంతో మనస్తాపం చెంది తనలో తానే కుమిలి పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. 24 ఏళ్ల వ్యక్తికి 6 నెలల క్రితం వివాహం జరిగింది. అయితే భార్య అతనికంటే వయస్సులో ఆరేళ్ల పెద్ద అయినప్పటికీ ఆమెకు సరిగా మాటలు కూడా.. చీర కట్టుకోవడం కూడా సరిగా రాదు.. నడవలేదు కూడా.. ఇవ్వన్నీ దాచి పెట్టి తన జీవితం నాశనం చేశారు అంటు కుమిలిపోయాడు సదరు వ్యక్తి.
ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో చివరికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే భర్త గదిలోకి వెళ్లి ఎంతసేపటికి తలుపులు తీయకపోవడంతో భార్య భయపడిపోయింది. వెంటనే ఇరుగుపొరుగు వారిని పిలిచి తలుపు కొట్టిన ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఏం జరిగి ఉంటుందా అని కిటికీలోంచి చూడగా ఏకంగా దూలానికి వేలాడుతూ కనిపించాడు సదరు వ్యక్తి. దీంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా.. ఒక సూసైడ్ నోట్ కూడా లభించింది. తన భార్యకు చీర కట్టుకోవడం రాదని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సూసైడ్ నోట్ లో తెలిపాడు మృతుడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.