
బర్త్ డే అని పిలిచి దారుణం..చివరికి..
ఫ్రెండ్ బర్త్ డే పార్టీ అని పిలిచారు..అది నిజమే అని నమ్మి ఓ అమ్మాయి హాస్టల్ నుంచి వెళ్ళింది..ఆ తర్వాత పార్టీలో కొంతమంది నమ్మించి బలవంతం చేసి మందు తాగించారు.అలా యువతి మత్తులోకి జారుకోగానే యువతి పై అత్యాచారానికి పాల్పడ్డారు.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ విషయాన్ని బయట ఎవరికైనా చెబితే చంపేస్తామని చెప్పారు.దాంతో కొద్ది రోజులు ఎవరికీ చెప్పలేదు చివరికి ఓ రోజు పోలీసులకు ఈ విషయం గురించి చెప్పింది.
వివరాల్లొకి వెళితే.. ఈ దారుణ ఘటన ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది.. గురుగ్రామ్ లోని ఓ హాస్టల్ లో వెలుగు చూసింది.హాస్టల్ యజమాని.. అతని స్నేహితుడి బర్త్ డే పార్టీని హాస్టల్‌లోనే ఏర్పాటు చేశాడు. పార్టీకి ఆహ్వానించడంతో బాధితురాలు వెళ్లింది. అక్కడ యజమాని, అతని స్నేహితుడు కలిసి ఆమెకు మద్యం తాపించారు. అనంతరం యజమాని స్నేహితుడు ఆమెను బలాత్కరించాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదరించారు. ఈ ఘటన ఏప్రిల్ 16న జరిగింది. ఇది జరిగిన 20 రోజుల తర్వాత ధైర్యం చేసి యువతి.. పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు..ప్రస్తుతం హాస్టల్ యజమాని అతని స్నేహితుడు పరారిలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నారు.