చెల్లెలిపై కన్నేసిన అన్న.. చివరికి ఓ రోజు?

praveen
ఇటీవలి కాలంలో మహిళల రక్షణ రోజురోజుకి ప్రశ్నార్థకంగా మారిపోతోంది అన్న విషయం తెలిసిందే. మహిళలకు రక్షణ కల్పించేందుకు కొన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఎందుకో అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. వెరసి రోజురోజుకు మహిళ దుర్భర జీవితాన్ని గడపవలసిన దుస్థితి ఏర్పడుతోంది. ఈ క్రమంలోనే ప్రతిక్షణం ఆడపిల్ల భయపడుతు బ్రతకాల్సిన పరిస్థితి. మొన్నటి వరకు కేవలం బయట తిరిగే ఆకతాయిల నుంచి మాత్రమే మహిళలకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. కానీ ఇప్పుడు మాత్రం సొంత వాళ్ల నుంచి కూడా లైంగిక వేధింపులు ఎదురుకుంటున్నారు.

 వావి వరసలు మరిచి పోతున్న మనుషులు నీచాతి నీచంగా ప్రవర్తిస్తున్నారు. అంతే కాకుండా సొంత వాళ్ళ పైన అత్యాచారం చేస్తున్న ఘటనలు సభ్యసమాజం సిగ్గుపడేలా చేస్తున్నాయ్ అని చెప్పాలి. ములుగు  జిల్లా కన్నాయిగూడెం మండలంలో కూడా ఇలాంటి తరహా ఘటన జరిగింది. వరుసకు చెల్లి అయ్యే యువతిని బెదిరించి ఆరు నెలలుగా  అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. గొర్రెవుల గ్రామపంచాయతీ పరిధిలో వాసం పల్లి చంటి 28 ఏళ్ల యువకుడు ఉన్నాడు. అతనికి పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

 వావివరుసలు మరిచిపోయిన చంటి చివరికి చిన్నాన్న కూతురు పై కన్నేశాడు. కాగా ఓ రోజు సమయం చూసి ఆమెను లోబరుచుకున్నాడు. అన్న వరస అయ్యే నువ్వు ఇలా చేయడం తప్పు అని చెప్పినా కూడా వినిపించుకోలేదు. చివరికి  ఎవరికీ తెలియకుండా ఆరు నెలల నుంచి యువతిని లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరింపులు కూడా పాల్పడ్డాడు. ఇటీవలే  కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా బాలిక గర్భం దాల్చింది అన్న విషయం తేలింది. తల్లిదండ్రులు నిలదీయడంతో అసలు విషయం బయటపెట్టింది  తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న చంటి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: