బట్టలు విప్పు.. లేదంటే నీ భర్త ప్రాణాలు పోతాయి?

praveen
ప్రస్తుతం సభ్య సమాజం మొత్తం అధునాతన సాంకేతిక వైపు పరుగులు పెడుతూ ఉంటే కొంతమంది మాత్రం మూఢనమ్మకాల వైపు అడుగులు వేస్తూ ఉన్నారూ అన్న విషయం తెలిసిందే.  ఇలా ప్రజలు మూఢనమ్మకాలను క్యాష్ చేసుకుంటున్న ఎంతోమంది దొంగబాబాలు చివరికి బలహీనతలను తబలాలుగా మార్చుకొని డబ్బులు ఇవ్వడం లేదా నీచమైన పనులకు పాల్పడటం లాంటివి చేస్తూ ఉన్నారు.  దొంగ బాబాలు ఏకంగా ఆడవాళ్ళ పై అత్యాచారం చేసుకున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్ విషయం తెలిసిందే.


 ఇప్పుడు ఇలాంటి కోవకు చెందిన ఘటన జరిగింది అని చెప్పాలి. ప్రాణాలకు ప్రమాదం ఉంది అంటూ మాయ మాటలతో నమ్మించి చివరకి మహిళపై అత్యాచారం చేశాడు ఇక్కడొక బురిడీ బాబా. ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. 35 ఏళ్ల మహిళ కొన్ని రోజులుగా తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే ఆమెను ఒక అరవై ఏళ్ళ వ్యక్తి వద్దకు తీసుకెళ్లగా.. అతనికి మహిళ తన సమస్యలను చెప్పుకుంది. సమస్యలన్నీ తీరుస్తా.. దీనికోసం ప్రత్యేకంగా పూజలు చేయాలని చెప్పడంతో ఆమె అంగీకరించింది. గదిలోకి తీసుకు వెళ్లి బట్టలు విప్పాలంటూ సదరు వ్యక్తి సూచించాడు.


 అయితే మొదట సదరు మహిళ అంగీకరించ లేదు. కానీ ఆ తర్వాత చెప్పింది చేయకపోతే భర్త సోదరుడి ప్రాణాలు గాల్లో కలిసి పోతాయని కొడుకుకీ అంగవైకల్యం వస్తుంది అంటూ బెదిరించడంతో చివరికి అతను చెప్పినట్లు గానే చేసింది. దీంతో లొంగదీసుకొని అత్యాచారం చేసాడు. బాధిత మహిళ తర్వాత జరిగిన దారుణాన్ని సోదరుడుకీ చెప్పడంతో  పోలీసులకు ఆశ్రయించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.నిందితుడు ధనుంజయ గా గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి తోసారు. ఈ క్రమంలోనే ఆ దొంగ బాబాను లోతుగా విచారిస్తున్నారు పోలీసులు. దొంగ బాబా ఉచ్చులో పడి ఇంకా ఎంతోమంది బాధితులు మోసపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: