సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యుండి.. ఇదేం పని ఛీ ఛీ?

praveen
ఇటీవలి కాలంలో ఎంతోమంది పెద్ద పెద్ద చదువులు చదివినవారు. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వస్తే ఎంత బాగుండు అని కోరుకుంటున్నారూ. ఇలా ఒకసారి సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదిస్తే ఇక జీవితాంతం ఫైనాన్షియల్ ప్రాబ్లంస్ లేకుండా బ్రతకవచ్చు అని అనుకుంటున్నారు. అయితే ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఇద్దరు యువకులు  మాత్రం సాఫీగా ఉద్యోగం చేయడం మానేసి పెడదారి పట్టారు. చివరికి వారు చేసిన పనికి జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.  రాష్ట్రానికి చెందిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మాదక ద్రవ్యాలను తరలిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో పోలీసులకు పట్టుబడ్డారు.


 వివరాల్లోకి వెళితే.. ఏపీ లోని కాకినాడ జిల్లాపెదపూడి మండలం గొల్లల మామిడాడ కు చెందిన సూర్య సంపత్ రాజమహేంద్ర లోని మోరంపూడి కి చెందిన దీపక్ ఫణీంద్ర సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లుగా పని చేస్తున్నారు. మంచి ఉద్యోగం జీతం. కానీ జల్సాలకు అది సరిపోలేదు. కొంతకాలం నుంచి వర్క్ ఫ్రం హోం చేస్తున్న వీరు డ్రగ్స్ కి అలవాటు పడిపోయారు. ఈ క్రమంలోనే గోవాలో ఉన్న ఒక గుర్తు తెలియని వ్యక్తి దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేశారు. అనంతరం అక్కడి నుంచి బస్సులో హైదరాబాద్కు చేరుకున్న వీరు అంబర్పేట రింగ్ రోడ్డు వద్ద లారీ ఎక్కి రాజమహేంద్రవరానికి బయలుదేరారు.


 ఈ క్రమంలోనే పక్కా సమాచారం మేరకు నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు సూర్య సంపత్, దీపక్ లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు సెల్ఫోన్లు డ్రగ్స్ ప్యాకెట్లు కూడా స్వాధీనం చేసుకోవడం గమనార్హం. ఈ క్రమంలోనే ఈ డ్రగ్స్ విలువ 2.35 లక్షల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఇద్దరు యువకులు డ్రగ్స్ తీసుకోవడంతో పాటు ఇక మిగతా వారికి కూడా విక్రయిస్తున్నారని పోలీసు విచారణలో అసలు విషయం బయటపడింది. ఈ క్రమంలోనే ఇటీవలే ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపర్చిన పోలీసులు రిమాండ్కు  తరలించారు. ఈ విషయం కాస్త స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: