చలాన్ కోసం కారు ఆపితే.. ప్రాణం పోయింది?

praveen
ఇటీవల కాలంలో పోలీసులు పెండింగ్లో ఉన్న చలనాలను కట్టించేందుకు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే వాహనదారులు విషయంలో ఎంత కఠినంగా వ్యవహరించినా ఇక ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మాత్రం ఏది పట్టించుకోకుండా వదిలేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పోలీసులు మాత్రం ఎమర్జెన్సీ ఉంది అని చెప్పినా వినిపించుకోలేదు. పెండింగ్లో ఉన్న చలనాలను పట్టుబట్టి మరీ కట్టించుకున్నారు.

 కానీ పోలీసులు వ్యవహరించిన తీరు కారణంగా ఏకంగా తమ కొడుకు ప్రాణం పోయిందని  తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అభం శుభం తెలియని బాలుడు చివరికి పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయిన ఘటన తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో వెలుగులోకి వచ్చింది. జనగామ మండలం వెంకిర్యాల గ్రామానికి చెందిన మల్లేశం సరస్వతి దంపతులకు మూడు నెలల వయసున్న కొడుకు రేవంత్ ఉన్నాడు. అయితే అనారోగ్యానికి గురి కావడంతో ఇటీవల జనగామ లోనే ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ పంపించారు.

 ఇక బాలుడిని కారులో హైదరాబాద్ తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో వంగపల్లి గ్రామ శివారులో పోలీసుల తనిఖీల్లో భాగంగా కారును ఆపారు. కార్ పై వెయ్యి రూపాయల పెండింగ్ చలాన్ ఉందని వెంటనే మీసేవ కి వెళ్లి చెల్లించాలని అప్పుడే వదిలేస్తమనీ తెలిపారు. అయితే తాము వైద్యం నిమిత్తం ఎమర్జెన్సీ కోసం హైదరాబాద్ వెళ్తున్నామని చెప్పిన పోలీసులు పట్టించుకోలేదు. ఇక చలాన్ అన్న చెల్లింపు కోసం అరగంట సమయం పట్టింది. ఆ తర్వాత కారు ముందుకు కదిలింది. తార్నాక చేరుకోగానే బాలుడు లో కదలికలు లేవు. ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు చూసి అప్పటికే శిశువు మృతి చెందినట్లు తెలిపారు. సమయానికి ఆసుపత్రికి తీసుకు వచ్చి ఉంటే తమ బాబు బతికే వాడిని పోలీసుల కారణంగానే ఇదంతా జరిగిందని ఆ తల్లి కొడుకు మృతదేహాన్ని ముందు బోరున విలపించింది. అయితే అత్యవసరంగా వెళ్లే వాహనాలను తాము ఎప్పుడూ ఆపబోము అంటు పోలీసులు వివరణ ఇస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Caf

సంబంధిత వార్తలు: