ఛీ ఛీ అతనో ఆర్ఎంపీ డాక్టర్.. కానీ ఇదేం పని?
అయితే ఇలా వైద్యులు ఏకంగా ప్రజల ప్రాణాల కోసం తమ ప్రాణాలను పణంగా పెడుతుంటే కొంత మంది మాత్రం వైద్య వృత్తికే కళంకం తెచ్చే విధంగా వ్యవహరిస్తూ ఉంన్నారు. నిర్లక్ష్యంగా చికిత్స అందించి ప్రజల ప్రాణాలు ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్న వారు కొంతమంది అయితే.. వైద్య వృత్తిలో కొనసాగుతూ నీచాతి నీచం గా వ్యవహరిస్తున్నారు మరికొంతమంది. ఇక్కడ ఒక ఆర్ఎంపీ డాక్టర్ కూడా ఇలాంటిదే చేసి చివరికి కటకటాలపాలయ్యాడు అన్న విషయం తెలుస్తుంది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. ఒక పసికందును ఆర్ఎంపి వైద్యుడు ఏకంగా ఆన్లైన్లో అమ్మకానికి పెట్టాడు. విజయవాడలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలో ఉంటున్న అమృత రావు అనే వ్యక్తి గతకొంతకాలం నుంచి జి.కొండూరు మండలం లో ఆర్ఎంపీ డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. మూడు రోజుల పసిపాపను అమ్మకానికి పెట్టాడు ఈ ఆర్ఎంపీ డాక్టర్ ఓ వాట్సాప్ గ్రూప్లో దీనికి సంబంధించిన సమాచారాన్ని అమృత రావు పోస్ట్ చేయడం గమనార్హం. ఏకంగా మూడు లక్షలకు పసికందును అమ్మకానికి పెట్టినట్లు సదరు పోస్టుల్లో తెలిపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.