తండ్రిని చంపిన కొడుకు.. కారణం తెలిస్తే షాకే?

praveen
ఒకప్పుడు మనుషులు అంటే మానవత్వానికి కేరాఫ్ అడ్రస్. సాటి మనుషులకు ఏదైనా అపాయం జరిగింది అని తెలిస్తే చాలు అయ్యో పాపం అంటూ వెళ్లి సహాయం చేసేవారు. ముక్కు మొఖం తెలియని వారికి సైతం ఆకలి అంటే అన్నం పెట్టే వారు. కానీ నేటి రోజుల్లో మాత్రం మనుషుల్లో ఆ మానవత్వమే కనిపించకుండా పోయింది. టెక్నాలజీ తో పాటు మనిషి జీవన శైలిలో ఎన్నో మార్పులు వస్తున్నాయి అనే విషయం తెలిసిందే. అయితే అటు టెక్నాలజీకి అలవాటు పడితే ఏమి కాదు కానీ మానవత్వం అనేది మనిషి మరచిపోతున్నాడు అన్నది అర్ధమవుతుంది.

 ఎందుకంటే సాటి మనుషుల విషయం లో జాలి దయ చూపించడం గురించి పక్కన పెడితే.. కనీసం సాటి మనుషుల ప్రాణాలకు కూడా విలువ ఇవ్వడం లేదు మనిషి.. దారుణంగా ప్రాణాలు తీసేస్తూ హత్యలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయ్. ఇలా చిన్నచిన్న కారణాలకే క్షణికావేశం లో దారుణంగా ప్రాణాలను గాల్లో కలిపేస్తూ తర్వాత జైలు జీవితాన్ని గడుపుతున్నారు ఎంతోమంది. కేవలం పరాయి వాళ్ళ విషయంలోనే కాదు సొంత వాళ్ల విషయంలో కూడా ఇదే జరుగుతుంది అన్నది అర్ధమవుతుంది..

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది అని చెప్పాలి. తండ్రీ కొడుకుల మధ్య చోటు చేసుకున్న చిన్నపాటి వివాదం చివరికి తండ్రిని హత్య చేసేంత వరకు వెళ్ళింది. గుమ్మడిదల మండలం నాగిరెడ్డి గూడెం కు చెందిన గడ్డం సత్యనారాయణ అనే 55 ఏళ్ల వ్యక్తి యాసంగి ధాన్యాన్ని విక్రయించాడు. ఈ క్రమంలోనే 30000 వచ్చాయి. అయితే ఇటీవలే ఈ డబ్బు విషయంలో తండ్రీ కొడుకుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే ఆగ్రహంతో ఊగిపోయిన కొడుకు చంద్రయ్య తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: