ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. చీమలు కుట్టి శిశువు మృతి?

praveen
ఇటీవల కాలంలో అధికారం లోకి వచ్చిన ప్రభుత్వాలు  పేద ప్రజల కోసం ప్రభుత్వాసుపత్రి లలో అన్ని కూడా రూపు రేఖల్ని మార్చేస్తుందని మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఎన్నో గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ కొన్ని ప్రభుత్వాసుపత్రి లో మాత్రం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న విధం గా మారి పోయింది పరిస్థితి.. మెరుగైన వసతులు కాదు కనీస వసతులు కూడా లేని పరిస్థితి నెలకొంది. ఎక్కడో ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి పరిస్థితి నెలకొంది. చీమలు కుట్టడం కారణం గా మూడు రోజుల శిశువు చివరికి ప్రాణాలు వదిలింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వెలుగు  లోకి వచ్చింది.

 మహోబా జిల్లా ఆస్పత్రిలో నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతున్న మూడు రోజుల శిశువు చీమలు కుట్టి మరణించిన ఘటన సంచలనం గా మారి పోయింది. మహోబా జిల్లా కూల్పాహార్ తాసిల్ ప్రాంతం లోని మురారి గ్రామానికి చెందిన సురేంద్ర గర్భిణి అయిన తన భార్యను ఆస్పత్రి లో చేర్పించాడు. మే 30వ తేదీన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే శిశువు ఆరోగ్యం బాగా లేకపోవడం తో వైద్యులు ఐసీయూ లో ఉంచి వైద్యం అందిస్తున్నారు.

 ఐసీయూలో అరకొర సదుపాయాలు మాత్రమే ఉండడం తో జూన్ 2వ తేదీన చీమలు కుట్టడం కారణంగా ఆ శిశువు మృతి చెందింది. దీంతో వారికి కొడుకు పుట్టాడన్న ఆనందం మున్నాళ్ళ ముచ్చటగానే మారి పోయింది.  ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణం గానే ఇదంతా జరిగిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు.. లంచం తీసుకొని కూడా సరిగా చికిత్స చేయలేదని ఆరోపిస్తున్నారు. ఐసీయూ లో కూడా దుమ్ము చీమలు లాంటివి ఉన్నాయి అని ఫిర్యాదు చేసిన డాక్టర్ పట్టించుకోలేదని ఆరోపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: