చెత్త కాగితాలు ఏరుకునేందుకు వెళ్లిన బాలిక.. కానీ చివరికి?

praveen
రేపు బాగుంటుందనే ఆశతో బతకడం తప్ప మనిషి ప్రాణాలకు గ్యారెంటీ లేదు అన్నది ప్రతి ఒక్కరూ చెప్పే మాట కొన్ని ఘటనలు చూస్తూ ఉంటే ఇలాంటిది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది.  పెళ్లి చేసుకొని పిల్లలను కనీ ఒక స్థాయికి ఎదిగిన తర్వాత వృద్ధాప్యంలో  చనిపోవడం సర్వ సాధారణమే. కానీ అభం శుభం తెలియని వయసులో కూడా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. చివరికి ఇలాంటి ఘటనలు చూసినప్పుడు గుండె తరుక్కుపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.

 కారులో ఇరుక్కున్న చిన్నారి చివరికి ప్రాణాలు వదిలింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. నాగ నూల్ బీసీ కాలనీకి చెందిన అంజమ్మ పట్టణంలో చెత్త కాగితాలు సేకరించడంతో పాటు ఇనుప సామాన్ దుకాణంలో కూలీగా పనిచేస్తూ ఉంటుంది. ఇక ఆమెకు తొమ్మిదేళ్ల కూతురు సుగుణ ఉంది. ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. అయితే ఇటీవలే తల్లి కూలీ పనికి వెళ్ల గా చిన్నారి మధురానగర్ కాలనీ లో చెత్త కాగితాలు  సేకరించడానికి వెళ్ళింది. ఈ క్రమంలోనే అదే కాలనీలో నివాసముంటున్న సయ్యద్ ఇమ్రాన్ భాష తన కారును ఇంటి వెనక ఖాళీ స్థలంలో పార్క్ చేసాడు.

 అటువైపుగా  వెళ్లిన సుగుణ కారు డోరు పట్టుకోగా అది ఎంతో సులభంగా తెరుచుకుంది. ఆ తర్వాత కారులో కూర్చుని డోరు వేసుకుని కూర్చుంది సుగుణ. రాత్రి అయిన బాలిక ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికిన తల్లి ఇక చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక అదే రోజు రాత్రి కార్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.  కారులో మృతదేహం ఉంది అన్న విషయాన్ని గుర్తించారు. ఈ క్రమంలోనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సమీపంలో, ఇంట్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పలు వివరాలు సేకరించారు. ఇక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉండటం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: