ఆన్ లైన్ లో అలా చేసి.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి సూసైడ్?
ఇక్కడ ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.. ఆమె ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మంచి జీతం కూడా వస్తోంది. కానీ చివరికి బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఇలా సూసైడ్ చేసుకోవడానికి కారణం ఆమె ఒక ఆన్లైన్ గేమ్ కి బానిసగా మారిపోవడమే. ఇటీవలికాలంలో ఆన్లైన్ గేమ్స్ కారణంగా ఎంతోమంది సంపాదించిన మొత్తాన్ని పోగొట్టుకుంటూ చివరికి జీవితాన్ని దుర్భరంగా మార్చుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఓ యువతి ఇలాంటిదే చేసింది. చెన్నై లోని మనల్ పుదు నగరంలో ఆన్లైన్లో రమ్మీ ఆడింది యువతి. ఇక నగదు బంగారం కోల్పోయింది.
చివరికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భాగ్యరాజ్ అనే వ్యక్తి ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుండగా ఆరేళ్ల క్రితం భవాని అనే యువతిని వివాహం చేసుకున్నాడు. భవాని ఐటీ సంస్థలో పనిచేస్తూ ఉండటం గమనార్హం. అయితే ఇటీవలే రాత్రి సమయంలో స్నానానికి వెళ్ళిన భవాని బాత్రూం లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇక భర్త ఒక్కసారిగా షాక్కు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఇక భవాని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆన్లైన్ రమ్మి కి బానిసైన భవాని తన కుటుంబ సభ్యుల వద్ద ఆరు నెలల క్రితం మూడు లక్షల రూపాయలు అప్పు చేసింది. ఆమె దగ్గర ఉన్న బంగారం కూడా గేమ్ లో పెట్టి నష్టపోయిందని.. చివరికి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు..