రైలు ఇంజన్ లో వింత శబ్దాలు.. ఏంటా అని చెక్ చేస్తే షాక్?

praveen
ట్రైన్ నడుపుతున్న లోకో పైలెట్ చేతిలో వందల మంది ప్రాణాలు ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అందుకే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ రైలు నడపాల్సి ఉంటుంది. ఇక్కడ ఇలాగే ఒక లోకో పైలెట్ ట్రైన్ నడుపుతున్న సమయంలో ఊహించని విధంగా   ఇంజన్ నుంచి వింత శబ్దాలు రావడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు. తీరా రైలు ఒక స్టేషన్లో ఆగిన తర్వాత ఏం జరిగిందో అని చూసి మరింత ఆశ్చర్యం లో మునిగిపోయాడు. ఈ ఘటన పాట్నా నుండి రాజ్ గిర్ మీదుగా వస్తున్న బుద్ధపూర్ణిమ ఎక్స్ప్రెస్ లో జరిగింది అని చెప్పాలి. ట్రైన్ పట్టాలపై పరుగులు పెడుతుంది.

 ఈక్రమంలోనే ఎప్పటిలాగానే ఇంజన్లో కూర్చున్నాడు లోలో పైలెట్. ఇంతలో ఎవరో ఏడుస్తున్నట్లుగా వింత శబ్దం వినిపించింది. దీంతో వెంటనే అప్రమత్తమై చుట్టుపక్కల మొత్తం చెక్ చేశాడు. కానీ ఎవరూ కనిపించలేదు. దీంతో అతనిలో ఒకరకమైన భయం మొదలైంది. ఇక ఆ ఏడుపులు క్రమక్రమంగా ఎక్కువ అవుతూ వచ్చాయి. పైకి ధైర్యంగా ఉంటున్నట్లు కనిపించినా లోలోపల మాత్రం తెగ భయపడిపోయాడు లోకో పైలట్. ఈ క్రమంలోనే గయా జంక్షన్ లో రైలు ఆగిన తర్వాత ఎందుకైనా మంచిది అని రైలు ఇంజన్ కింది భాగాన్ని ఒకసారి చెక్ చేసాడు. ఈ క్రమంలోనే ఇంజన్ కింది భాగంలో ఏదో ఉన్నట్లు గమనించి టార్చ్ లైట్ వేసి చూశాడు.

 దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు లోకో పైలెట్.. ఎందుకంటే ఇంజన్ కింది భాగంలో ఉంది ఏకంగా ఒక మనిషి. వెంటనే తేరుకున్న లోకో పైలట్ స్థానిక రైల్వే స్టేషన్ సిబ్బందికి విషయం తెలియ జేశాడు. ఈలోగా ఇక రైలు ఇంజన్ లో కూర్చున్న వ్యక్తి మంచి నీళ్ళు కావాలని అడుగుతున్నట్లుగా  లోకో పైలెట్ గుర్తించాడు. రైలులో ప్రయాణిస్తున్న కొంత మంది ప్రయాణికులు సహాయం తీసుకుని ఆ యువకుడిని బయటకు తీశాడు. ఇక ఆ తర్వాత ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు.  ఇక ఆ యువకుడు ఎవరు అన్న విషయం మాత్రం తెలియరాలేదు. అయితే రైల్వే డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: