ఓరిదేవుడా.. పేరెంట్స్ తిడితే.. ఏ కొడుకైనా ఇలా చేస్తాడా?
చిన్న సమస్య వచ్చినా కూడా దానికి పరిష్కారం ఒకటే సూసైడ్ అన్న విధంగా నేటి రోజులలో జనాలు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే వెనకా ముందు ఆలోచించకుండా ఏమవుతుందో అనే ఆందోళన లేకుండా చివరికి బలవన్మరణాలకు పాల్పడుతు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు ఎన్నో కుటుంబాలలో విషాదాన్ని నింపుతున్నాయి అనే విషయం తెలిసిందే. తల్లిదండ్రులు మందలించారని టీచర్ తిట్టిందని లేదా స్నేహితులతో గొడవ జరిగిందని ఇలా చిన్న కారణాలకే బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య నేటి రోజుల్లో పెరిగి పోతుంది అని చెప్పాలి.
ఇక్కడ ఓ యువకుడు ఇలాంటి క్షణికావేశ నిర్ణయంతో తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు. గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఓ యువకుడు చివరికి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం లో వెలుగులోకి వెలుగులోకి వచ్చింది ఈ విషాదకర ఘటన. ములుగు గ్రామానికి చెందిన గణేష్ చెప్పినట్లు వినడం లేదని ఇటీవల తల్లిదండ్రులు లక్ష్మీ, బాలయ్య మందలించారు. ఈ క్రమంలోనే అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన గణేష్ ఇటీవలే ఊరిచివర ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.