ఓరి నాయనో.. ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయలేదని.. చంపేశాడు?

praveen
టెక్నాలజీ పెరిగిపోతుంది మనిషి జీవన శైలిలో కూడా ఎంతగానో మార్పు వస్తుంది. ఇక ఏది కావాలన్నా అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో దొరికే పోతుంది. ఇలా నేటి రోజుల్లో అంతా మంచే జరుగుతుంది. కానీ మనుషుల ఆలోచన తీరే ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇక ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలో చూస్తుంటే సభ్యసమాజం భవిష్యత్తు ఏంటో అని ప్రతి ఒకరు ఆందోళన చెందే దుస్థితి వచ్చింది.  ఇంతకీ ఏం జరిగిందంటే.. నేటి రోజుల్లో కామన్ గా ప్రతి రోజూ వినబడే మాట ఏదైనా ఉంది అంటే అది ఒక సూసైడ్, మర్డర్  మాత్రమే.
 ఆ కారణానికి సూసైడ్ చేసుకున్నారు.. ఈ కారణానికి సూసైడ్ చేసుకున్నారు అంటూ ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా అటు స్కూల్ చదువులోనే విద్యార్థులు చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్యే శరణ్యం అని భావిస్తూ చివరికి బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయ్. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ లేకపోవడం కారణంగా దారుణం జరిగిపోయింది.

 ఈ ఘటన యూపీలో వెలుగులోకి వచ్చింది. ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ అంగీకరించలేదని ఆగ్రహంతో ఓ యువకుడు 16 ఏళ్ల బాలికను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. అడ్డుకోబోయిన తల్లిని కూడా గాయపరిచాడు. ముజఫర్ నగర్ లోని జోహ్ రామ్ గ్రామంలో పెళ్లి కార్డు ఇచ్చేందుకు బాలిక ఇంటికి వెళ్ళాడు రవి అనే యువకుడు. ఇక కార్డు తీసుకునేందుకు బాలిక ముందు రాగా తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచాడు.  తల్లి వెంటనే అప్రమత్తమై కూతురిని  కాపాడేందుకు ప్రయత్నిస్తే ఆమె పై కూడా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అనంతరం కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తను ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: