ఓరిదేవుడా.. కట్టుకున్న భర్తే అలా చేశాడు?
ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. హైదరాబాద్ నగరంలోని పంజాగుట్టలోని దారుణ ఘటన చోటుచేసుకుంది. దంపతుల మధ్య ఏర్పడిన వివాదం భార్య ప్రాణం పోవడానికి కారణమైంది. ఏకంగా కష్ట సుఖాల్లో తోడు ఉంటానని ఏ సమస్య రాకుండా చూసుకుంటాను అంటూ ప్రమాణం చేసిన భర్త కోపంతో ఊగిపోయి భార్యను దారుణంగా హత్య చేశాడు. ఇక ఆ తర్వాత భార్య లేని జీవితం వద్దు అనుకుని తాను కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అస్సాం రాష్ట్రానికి చెందిన మహానంద బిశ్వాస్, పంప సర్కారు దంపతులు.. జీవనోపాధి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చి పంజాగుట్ట పరిధిలోని ప్రేమ్ నగర్ లో ఉంటున్నారు.
అయితే గత కొంత కాలం నుంచి వీరి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో కోపంతో ఊగిపోయిన భర్త క్షణికావేశంలో విచక్షణ కోల్పోయాడు. ఈ క్రమంలోనే నీళ్ళ తొట్టి లో భార్యను ముంచి దారుణంగా హతమార్చాడు. అనంతరం నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించే క్రమంలో అతని జేబులో ఉన్న చిన్న డైరీలో భార్యను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నట్టు రాశాడు. ఇక రైల్వే పోలీసులు సమాచారంతో పంజాగుట్ట పోలీసులు అతని నివాసానికి వెళ్లి అక్కడ భార్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.