అయ్యో దేవుడా.. 11వ అంతస్తు నుంచి కింద పడిన బాలుడు.. చివరికి?

praveen
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తున్న ఎన్నో హృదయ విదారక ఘటనలు ఎంతో మంది మనసును కదిలిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే అభం శుభం తెలియని ఎంతో మంది చిన్నారులు అనుకోని ఘటనల కారణంగా చివరికి ప్రాణాలు కోల్పోతూ కుటుంబంలో విషాదం నింపుతున్నారు. ఇలాంటి ఘటనల గురించి తెలుసుకున్నప్పుడు అయ్యో దేవుడా ఆ చిన్నారి విషయంలో ఇలా జరిగిందేంటి అని అంటూ ప్రతి ఒక్కరూ  విచారం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. తల్లిదండ్రులు పిల్లల విషయంలో వహించే చిన్న పాటి నిర్లక్ష్యం ఏకంగా అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లల ప్రాణాలు పోవడానికి కారణం అవుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.

 దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కూడా ఇలాంటి హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది.  దక్షిణ ముంబైలో ఉన్న ఒక అపార్ట్ మెంట్ లోని 11 వ అంతస్తు నుంచి ఐదేళ్ల పిల్లవాడు కింద పడి మృతి చెందాడు. దీంతో ఆ తల్లిదండ్రుల రోదన మిన్నంటింది అని చెప్పాలి. ముంబైలోని బైకుల్ల ప్రాంతంలో హౌజింగ్ సొసైటీలో ఈ ఘటన జరిగింది. పిల్లవాడు తన ఫ్లాట్లోనే గోడ పట్టుకొని ఆడుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. పదకొండవ ఫ్లోర్ లో ఉన్న తన ఫ్లాట్ కు ఉన్న ఓపెన్ విండో దగ్గర గొడుగు పట్టుకొని ఆడుకుంటున్నాడు ఆ పదేళ్ల బాలుడు.

కాగా పక్కనే ఉన్న మంచం మీదికి ఎక్కి కిటికీలోంచి బయటకు తొంగి చూసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే  కిటికీలో నుంచి కిందపడిపోయాడు బాలుడు. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో చిన్నారి తల్లి ఇతర బంధువులు కూడా అదే గదిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సదరు బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా ఇక సదరు బాలుడిని ఆసుపత్రికి తరలించే లోపు చివరికి ప్రాణాలు వదిలినట్లు తెలుస్తుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: