పంచాయతీ పెద్దలు తీర్పు.. ఎంత పని చేశారు?
ఊరి సమస్యల ను అటు పంచాయతీలో పరిష్కరించడం ఇలాంటివి ఇప్పటికి కూడా కొన్ని గ్రామాలలో కొనసాగుతూనే ఉన్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలోనే కొన్ని సార్లు పంచాయతీ పెద్దల తీర్పులు ఇక నేరం చేసినవారికి విధించే శిక్షలు కూడా అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి. ఇక్కడ అస్సాంలోని నాగోన్ జిల్లాలో పంచాయతీ ప్రజలు విధించిన శిక్ష అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. గ్రామ పెద్దల సమక్షంలో ఒక వ్యక్తిని సజీవ దహనం చేశారు.
ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి. బోర్ లాలూగావ్ గ్రామానికి చెందిన రంజిత్ పై హత్య ఆరోపణలు ఉన్నాయి. ఓ మహిళ హత్య కేసులో దోషిగా అతని తేల్చారు పంచాయతీ పెద్దలు. ఈ క్రమంలోనే అతడిని అందరి ముందు సజీవ దహనం చేసి తగలబెట్టడం గమనార్హం. అనంతరం ఎవరికీ ఈ విషయం తెలియకుండా పూడ్చిపెట్టారు. అయితే ఎవరో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకుని పూడ్చి పెట్టిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శరీరం 90% కాలిపోయినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.