డేటింగ్ యాప్ లోకి డాక్టర్.. చివరికి ఊహించని షాక్?
ఎందుకంటే డేటింగ్ యాప్ లో పరిచయమైన యువతులు ఎంతో తీయగా మాట్లాడటం ఇక ఆ తర్వాత చనువు పెంచుకోవడం చివరికి ఇక అంతా ఇన్ఫర్మేషన్ గుంజుకున్న తర్వాత బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజడం లాంటి చేస్తూ ఉన్నారు. ఇలా ఇటీవలి కాలంలో ఎంతోమంది హనీట్రాప్ కారణంగా మోసపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది అని చెప్పాలి. ఇక్కడ డేటింగ్ యాప్ ఉపయోగించిన ఒక డాక్టర్ నిండా మోసపోయాడు. ఇందుకు సంబంధించిన ఘటన కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.
సికింద్రాబాద్కు చెందిన ఓ డాక్టర్ కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమం లోనే డేటింగ్ యాప్ లో యువతులు అతని తో ఎంతో తియ్యగా మాట్లాడారు. హిందీ ఇంగ్లీష్ లో మాట్లాడి మెల్లగా ముగ్గులోకి దింపారు. ఈ క్రమం లోనే వ్యక్తిగత ఫోటోలు పంపించాలి అంటూ కోరడం తో వెనకా ముందు ఆలోచించకుండా సదరు డాక్టర్ పంపించాడు. ఇక ఈ ఫోటోలను అడ్డుపెట్టుకొని కేటుగాళ్లు డాక్టర్ బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఈ విషయంపై పోలీసులు డాక్టర్ కి మూడు సార్లు కౌన్సిలింగ్ ఇచ్చిన అతని పేరు మార్చుకోక చివరికి డబ్బు మోసపోయాడు.