లిప్ స్టిక్ కావాలన్న భార్య.. భర్త షాప్ కి వెళ్లి వచ్చేసరికి.. ట్విస్ట్?

praveen
భార్య భర్తల మధ్య గొడవలు జరగడం సర్వసాధారణం. కానీ చిన్నపాటి గొడవలు పెద్దదిగా చేసుకుంటే చివరికి పచ్చని కాపురంలో చేజేతులారా తెచ్చిపెట్టుకున్నట్లు  అవుతుంది. ఇటీవల కాలంలో ఎంతో మంది భార్యాభర్తలు ఇలాగే చేస్తూ చివరకు దాంపత్య బంధాన్ని విడాకుల వరకు తీసుకు వెళ్తున్నారు  అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. వారికి వివాహం జరిగే 8 ఏళ్ళు అవుతుంది.  ఎంతో ఆనందంగా ఉన్నారు. గత కొంతకాలం నుంచి మాత్రం వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని ఇద్దరికి నచ్చజెప్పారు. ఇక ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలు ఉండవు అని భావించారు.


 ఇక పంచాయతీ జరిగిన అనంతరం భార్యను తీసుకొని ఇంటికి బయలుదేరాడు సదరు వ్యక్తి. బస్టాండ్ దగ్గర కు చేరుకున్న తర్వాత లిప్స్టిక్ కావాలి అంటూ కోరింది భార్య. ఇంకేముంది భార్య అడగడంతో పక్కనే ఉన్న షాప్ లోకి వెళ్లి లిప్ స్టిక్ తేవడానికి వెళ్లాడు భర్త. కానీ బస్టాండ్ కు తిరిగివచ్చిన తర్వాత ఊహించని ట్విస్ట్. హర్యానా రాష్ట్రం పటియాల పరిది దేవి గర్ గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కర్నల్ లోని  ఓ గ్రామానికి చెందిన యువతి తో 2014లో వివాహం జరిగింది సదరు యువకుడికి.


 వీరికి ప్రస్తుతం నాలుగేళ్ల కుమార్తె కూడా ఉంది. ఇటీవలి కాలంలో భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతుంది. స్థానికంగా ఉన్న ఓ యువకునితో భార్య అక్రమ సంబంధం ఏర్పడింది. ఇక భర్తకు తెలియకుండా రహస్యంగా అతనితో రాసలీలలు కొనసాగించడం మొదలు పెట్టింది. ఎన్నోసార్లు గ్రామంలో పంచాయతీ మాత్రమే కాదు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు. ఇటీవల మరోసారి పంచాయతీ  పెద్దలు రాజీ కుదుర్చారు. దీంతో సదరు వ్యక్తి భార్యను తీసుకుని ఇంటికి వెళ్లేందుకు బస్టాండ్కు వచ్చాడు. ఇంతలో భార్య లిప్స్టిక్ కావాలని అడగడంతో తీసుకువచ్చేందుకు వెళ్ళాడు. బస్టాండ్ కి వచ్చేసరికి కూతురు భార్య అదృశ్యమైంది. చివరికి మళ్లీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసాడు భర్త. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: