పేరెంట్స్ జాగ్రత్త.. చాక్లెట్ కవర్ చిన్నారి ప్రాణం తీసింది?
ఎందుకంటే ఇంకా లోకం తీరు చూడని అభం శుభం తెలియని చిన్నారులను సైతం మృత్యువు కబళించి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగులు ఇస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇలా ఇప్పటి వరకు ఎంతో మంది చిన్నారుల విషయంలో జరిగింది. ఇక ఇటీవలే కర్ణాటకలోని బళ్ళారి లో కూడా ఇలాంటి ఓ విషాద ఘటన జరిగింది. సాధారణంగా చిన్నారులు అన్న తర్వాత చాక్లెట్ కావాలి అంటూ మారాం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇలా పిల్లలు చాక్లెట్ కావాలి అని అడిగినప్పుడు తల్లిదండ్రులకు కొనివ్వడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు
కానీ ఇక్కడ మాత్రం ఏకంగా చాక్లెట్ ఒక చిన్నారి ప్రాణం పోవడానికి కారణమైంది. అప్పటి వరకు సంతోషంగా తమ ముందే ఆడుకున్న కూతురు విగతజీవిగా మారిపోవడంతో ఆ తల్లిదండ్రుల గుండె బద్దలైంది. ఓ దేవుడా మాకు ఇంత అరణ్య రోదన ఎందుకు మిగిల్చావు అంటూ గుండెలు బాదుకుంటూ ఆ తల్లిదండ్రులు అరణ్యరోదనగా విలపించారు. సమన్వి అనే ఆరేళ్ళ చిన్నారి స్కూల్ బస్సు ఎక్కడానికి నోట్లో చాక్లెట్ పెట్టుకొని పరుగులు తీసింది. ఇక తొందరలో చాక్లెట్ కవర్ తో పాటు మింగేసింది. దీంతో అది గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించగా చిన్నారి అప్పటికే చనిపోయింది.