పాపం.. వర్షమే ప్రాణం తీసింది?
ఇటీవలే వర్షాలు తగ్గుముఖం పట్టాయని కాస్త ఊపిరి పీల్చుకున్నారు అందరు. ఈ క్రమంలోనే వరద ముంపు గ్రామాల ప్రజలు అందరూ కూడా మళ్లీ పునరావాస కేంద్రాల నుంచి తమ ఇళ్లకు చేరి ఇక బురదను మొత్తం క్లీన్ చేసే పనిలో పడ్డారు. ఇలాంటి సమయంలో మళ్లీ భారీ వర్షాలు మొదలయ్యాయి అన్న విషయం తెలిసిందే. తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు. అయితే వరకు భారీ వర్షాల నేపథ్యంలో పాత ఇల్లు కూలి ఇప్పటికే ఎంతోమంది శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు వదిలారు. దీంతో ఎన్నో కుటుంబాల్లో విషాదం నిండిపోయింది.
ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఓ ఇల్లు కూలి ఇద్దరు మృతి చెందగా చివరికి ఒకరికి గాయాలు అయ్యాయి. ఈ విషాదకర ఘటన వరంగల్లో వెలుగులోకి వచ్చింది. వరంగల్లోని మండి బజార్ లో ఓ పాత భవనం కూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి అనేది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.