షాకింగ్ : ఆపరేషన్ చేశారు.. అది లోపలే పెట్టి కుట్టేసారు.. చివరికి?
అయితే ఎంతో మంది డాక్టర్లు ఇలా ప్రజల ప్రాణాలను కాపాడటానికి తమ ప్రాణాలను కూడా పణంగా పెడుతుంటే.. కొంతమంది డాక్టర్లు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే అరకొర వైద్య చికిత్స అందించి ఎంతోమంది ప్రాణాల మీదికి తీసుకు వస్తున్నారు. ఇక వైద్య వృత్తికే కళంకం తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ప్రసవం కోసం వచ్చిన గర్భిణీకి శస్త్ర చికిత్స చేసి బిడ్డను బయటకు తీసిన డాక్టర్లు ఇక కాటన్ మరిచి అలాగే కుట్లు వేశారు. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వాసుపత్రిలో వెలుగులోకి వచ్చింది.
వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో బావాని కుంట తండా కు చెందిన నునావత్ దేవేందర్ భార్య సౌజన్య ఇటీవలే పురిటి నొప్పులతో ఆస్పత్రిలో చేరింది. ఈ క్రమంలోనే శస్త్రచికిత్స చేసి డెలివరీ చేశారు వైద్యులు. అయితే ఇక శస్త్ర చికిత్స జరిగిన నాటి నుంచి సౌజన్య అనారోగ్యం తో బాధ పడుతుంది. కడుపు నొప్పి తో పాటు మరి కొన్ని సమస్యలు కూడా వేధిస్తున్నాయి. ఇటీవలే భర్తను తీసుకుని వరంగల్లోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళింది. ఈ క్రమంలోనే శస్త్ర చికిత్స చేసిన వైద్యులు లోపల కాటన్ మర్చిపోయినట్లు పరీక్షల్లో వెల్లడైంది. ఈ క్రమంలోనే భర్త దేవేందర్ భార్యను తీసుకొచ్చి ఆసుపత్రికి వైద్యులను నిలదీశాడు. మళ్లీ శస్త్ర చికిత్స చేసి లోపల ఉన్న కాటన్ తొలగించారు వైద్యులు. ప్రమాదం లేదని చెప్పారు.