కొడుకు ప్రేమ.. తల్లి ప్రాణం మీదికి తెచ్చింది.. చివరికి?
ఈ విషాదకర ఘటన ప్రకాశం జిల్లా కంభం మండలం లింగాపురం గ్రామం లో వెలుగులోకి వచ్చింది. సత్తెనపల్లికి చెందిన సాలమ్మ బేస్తవారిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో హోంగార్డుగా పని చేస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు వినయ్ ఇటీవలే వేరే సామాజిక వర్గానికి చెందిన మైనర్ బాలికతో ప్రేమలో పడ్డాడు. పెద్దలను కాదని ఇంటి నుంచి వెళ్లిపోయారు ఇద్దరు. ఇక పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు ఇద్దరిని తీసుకువచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి పెద్దలకు అప్పగించారు. దీంతో అప్పటి నుంచి కాకినాడ కోచింగ్ సెంటర్ లో ఉంచి చదివిస్తుంది తల్లి సాలమ్మ.
ఇటీవలే మరోసారి ఇద్దరూ కలిసి పెద్దలకు తెలియకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఇక సాలమ్మ సమస్య మొదటికి వచ్చింది. అమ్మాయి తన కుటుంబీకులు ఆమెను నిలదీసి అవమానించారు. ఇక కొడుకు మాట వినకపోవడం మరోవైపు ఊరంతా పరువూ పోయేలా అమ్మాయి తరపు బంధువులు అవమానించిన నేపథ్యంలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది సాలమ్మ. ఆమెను ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు. చికిత్స పొందుతూ కన్నుమూసింది. అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న అని డైరీలో ఒక సూసైడ్ నోట్ కూడా రాసినట్లు తెలుస్తోంది.