ఛీ వీడు తండ్రేనా.. భార్య లేక పోవడంతో.. కన్న కూతురినే?
ఇక ఇటీవలే తమిళనాడు రాష్ట్రంలో కూడా ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది అనేది తెలుస్తుంది. సాధారణంగా తండ్రి కూతుర్ల బంధం ఎంతో ప్రత్యేకమైనది అని చెబుతూ ఉంటారు. కూతురంటే తండ్రికి.. తండ్రి అంటే కూతురు కి అమితమైన ప్రేమ ఉంటుంది అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక కీచక తండ్రి మాత్రం కన్నకూతురిపైనే కామవాంఛతో రగిలిపోయాడు. ఈక్రమంలోనే భార్య లేని సమయం చూసి కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరికి అభం శుభం తెలియని కూతురును గర్భవతిని చేశాడు. ఈ దారుణ ఘటన ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
వేలూరు జిల్లా విరించిపురం గ్రామానికి చెందిన 40 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇతనికి భార్య ఒక కూతురు ఉంది. అయితే భార్య ఎనిమిదేళ్ల క్రితమే వేరే వ్యక్తి తో వెళ్ళిపోయింది. ఈ క్రమంలోనే భార్య లేకపోవడంతో ఇక 13 ఏళ్ల కుమార్తెపై కామవాంఛను తీర్చుకోవడం మొదలుపెట్టాడు. ఈ కామాంధుడు తాతయ్య ఇంటి నుంచి తండ్రికి భోజనం తీసుకువచ్చే కూతురిపై అత్యాచారానికి పాల్పడటం మొదలు పెట్టాడు. అయితే ఇటీవల బాలికకు కడుపునొప్పి రావడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించగా గర్భవతి అన్న విషయం తేలింది. ఈ క్రమంలోనే వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇక కన్నా తండ్రి కారణం అన్న విషయం తేలింది.