బైక్ ని ఢీకొట్టిన ఆంబోతు.. చివరికి ఏం జరిగిందంటే?
ఇక కొన్ని కొన్ని సార్లు ఏకంగా నడిరోడ్డుపై నిద్రించటం లాంటివి కూడా చూస్తూ ఉంటాము. ఆ సమయంలోనే ఇక కొంతమంది వాహనదారులు వేగంగా వాహనాలు నడపడం కారణంగా ప్రమాదాల బారిన పడుతూ ఉంటాయి ఎన్నో పశువులు. కొన్నిసార్లు పశువుల కారణంగా వాహనదారులు ప్రమాదంలో పడతారు. పంజాబ్ లోని బర్నాల నగరంలో కూడా ఇలాంటి తరహా ఘటన జరిగింది. అక్కడి ప్రాంతంలో ఎప్పుడూ పశువులు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఇటీవల రెండు ఎద్దుల మధ్య జరిగిన పోట్లాట మరో వ్యక్తి ప్రాణాలమీదికి తీసుకు వచ్చింది అని చెప్పాలి. బర్నాల నగరంలోని హందీ మాయ రోడ్డుపై రెండు ఎద్దులు ఘర్షణ పడ్డాయి.
ఇక ఇలా పోట్లాడుతున్న ఎద్దులలో. ఒకటి ఉన్నట్లుండి ద్విచక్ర వాహనం వైపు దూసుకు వచ్చి బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న వాహనదారుడు ఎంతో దూరంలో ఎదురుపడ్డాడు. అయితే గాయాలతో మాత్రమే అతను బయటపడ్డాడు. ఇకపోతే లేచి నిలబడ్డాడో లేదు. అటు వైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన కార్ ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. ఇక వెంటనే స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉండడం గమనార్హం.