ఇంకా ఇలాంటి మనుషులు ఉన్నారా.. ముస్లిం మహిళకు చేదు అనుభవం?
ఈ క్రమంలోనే సదరు ముస్లిం మహిళ కు ఊహించని చేదు అనుభవం ఎదురైంది అని చెప్పాలి. ఇక ఈ క్రమంలోనే ఆమె సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా పెట్టిన ఒక పోస్ట్ కాస్త తెగ చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి. ఆమె పేరు హైఫా. బెంగళూరులో ఇల్లు కొనాలని అనుకున్నది. వెతుకులాట ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఒక బ్రోకర్ ద్వారా ఆమెకు ఇల్లు గురించి తెలిసింది. అతనితో వాట్సాప్ లో కాంటాక్ట్ అయ్యింది సదరు మహిళ. ఈ క్రమంలోనే అన్ని వివరాలు తెలుసుకుంది. కానీ ఆ మహిళకు మాత్రం ఆ బ్రోకర్ ఇల్లు అమ్మను అంటూ చెప్పేసాడు. దీనికి కారణం ఆమె ముస్లిం కావడమే.
ఈ క్రమంలోనే వారి మధ్య జరిగిన సంభాషణను స్క్రీన్ షాట్ తీసి తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. ఇక ఈ సంభాషణలో చూసుకుంటే సదరు మహిళ పేరు అడిగాడు బ్రోకర్. హైఫా అని చెప్పగానే హిందూ ఫ్యామిలీ ఏనా అంటూ అడిగాడు..అందుకు ఆమె నో చెప్పింది. ఓకే అంటూ అతను బదులిచ్చాడు. ఏమైనా సమస్య ఉందా అంటూ ఆమె అడగగా.. అవును ఇల్లు అందుబాటులో ఉంది కాని యజమాని హిందూ కుటుంబానికి మాత్రమే అమ్మాలనుకుంటున్నాడు అంటూ విషయం చెప్పడంతో మహిళ కు చేదు అనుభవం ఎదురైంది. అయితే మహిళ పెట్టిన ట్వీట్ చూసి అందరూ షాక్ అవుతున్నారు.