ఫోన్ ఎక్కువగా వాడుతున్నాడని.. కొడుకుని తుపాకీతో కాల్చిన తండ్రి?

praveen
నేటి రోజుల్లో ప్రపంచం మొత్తం మొబైల్ మాయలో పడిపోయి ఊగుతూ తూగుతూ ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కేవలం మనిషి అవసరాలను మాత్రమే తీర్చడానికి వచ్చిన మొబైల్ ఇక ఇప్పుడు ఏకంగా మనిషి ని శాసించే స్థాయికి ఎదిగింది.  కేవలం అవసరాలకు మాత్రమే.. ఎదుటివారితో ఫోన్ మాట్లాడటానికి మొబైల్ ఉపయోగించిన వారు ఇటీవల కాలంలో ఇక జీవితం మొత్తం మొబైల్ లోనే గడిపేస్తూ ఉన్నారు. ఒక్కసారి మనిషి జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే మొబైల్ లో గడిపిన గంటల సమయం తప్ప ఏదీ కనిపించదు నేటి రోజుల్లో అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఆ రేంజ్ లో ప్రస్తుతం జనాలు మొబైల్ కి బానిసలుగా మారిపోతున్నారు. అయితే ఒకవైపు కొత్త కొత్త గేమ్ లు పుట్టుకొస్తూనే ఉండటం.. మరో వైపు వినూత్నమైన ఎంటర్టైన్మెంట్ అందించడానికి  యాప్స్ తెర మీదకి వస్తున్న నేపథ్యంలో ఇక మొబైల్ వినియోగదారులకు బయట ప్రపంచంతో పనిలేకుండా పోయింది. ఏది కావాలన్నా మొబైల్లో దొరుకుతూ ఉండటం కారణంగా ప్రతి ఒక్కరు మొబైల్ కాస్త అతిగా వాడుతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే మొబైల్ కి బానిసగా మారిపోవడం కారణంగా ఎన్నో అనర్థాలు కూడా జరిగిపోతూవుంటాయి. మొబైల్ ఎన్నో కుటుంబాలు చిచ్చు రేపుతుంది అని చెప్పాలి.


 ఇక ఇటీవలే మొబైల్ కారణంగా జరగరాని ఘోరం జరిగిపోయింది. గుజరాత్లోని కామ్రేజ్ ప్రాంతంలో వవ్ గ్రామానికి చెందిన ఓంప్రకాష్ బాడీ గార్డ్ గా పని చేస్తున్నాడు  అయితే అతని కొడుకు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. చదువు పక్కనపెట్టి మొబైల్ తోనే కాలం గడిపేవాడు. అయితే ఎన్నిసార్లు అలా చేయవద్దు అని చెప్పినా తీరులో మాత్రం మార్పు రాలేదు. ఇటీవలే మొబైల్ ఎక్కువగా వాడుతున్నాడు అంటూ తండ్రి మందలించగా కొడుకు కూడా వాగ్వాదానికి దిగాడు. దీంతో కొడుకు తండ్రి తలపై వైపర్ తో రక్తం వచ్చేలా కొట్టాడు. దీంతో కోపంతో ఊగిపోయిన తండ్రి తుపాకీతో తన కొడుకు చేతి పై రెండు సార్లు కాల్పులు జరపగా తీవ్రగాయాలు అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: