కొడుకే లేడు.. ఇక కోడలెందుకు.. అత్తమామలు ఏం చేశారో తెలుసా?

praveen
ఇటీవలి కాలంలో ఎంతోమంది మహిళలు కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెడుతున్నారు. ఇక  ఎంతో సంతోషంగా ఉండాలని భావిస్తున్నారు. కానీ వారి ఆశలు మాత్రం కొన్నాళ్ళకి అడియాశలుగా మిగిలి పోతున్నాయ్ అని చెప్పాలి. ఎందుకంటే పెళ్లయిన కొన్నాళ్ళకే అదనపు కట్నం వేధింపులు ఎదుర్కొంటున్న ఘటనలు నేటి రోజుల్లో ఎక్కువగానే కనిపిస్తున్నాయ్. ఇక మరికొన్ని సార్లు భర్త మరణించిన తర్వాత అత్తమామలు సూటిపోటి మాటలతో వేధించడం లాంటి ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి అని చెప్పాలి.


 ఇక్కడ ఇలాంటిదే జరిగింది.ఆ మహిళకు పెళ్లి అయ్యి పద్నాలుగేళ్లయింది ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయ్యింది. కాని విధి వారి దాంపత్య జీవితాన్ని చిన్నచూపు చూసింది. ఈ క్రమంలోనే కరోనా వైరస్ బారిన పడిన ఆమె భర్త చివరికి ప్రాణాలు కోల్పోయాడు. అప్పటి వరకు ఎంతో సంతోషంగా సాగిపోయిన ఆమె జీవితంలో భర్త మరణంతో కష్టాలు మొదలయ్యయ్. భర్త బ్రతికి ఉన్నన్నాళ్ళూ ఆమెను ఒక్క మాట కూడా అనని అత్తామామలు భర్త చనిపోయిన తర్వాత హింసించడం  మొదలు పెట్టారు. మా కొడుకే బ్రతకిలేడు. ఇక మా ఇంట్లో నువ్వు ఎందుకు అంటూ ఇంట్లో నుంచి గెంటేసేందుకు ప్రయత్నిస్తున్నారు.


 ఈ క్రమం లోనే ధైర్యం చేసిన సదరు బాధితురాలు మహిళా కమిషన్ను ఆశ్రయించింది. ఇక మహిళా కమిషన్ వచ్చి పరిశీలించగా సీసీ కెమెరాల్లో దాడి చేసిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఈ ఘటన రాజస్థాన్లోని జైపూర్లో వైశాలి నగర్ లో వెలుగుచూసిన చెప్పాలి. భర్త అవదేశ్ కుమార్ కరోనా వైరస్ కారణంగా 2021లో మరణించగా ఇక అప్పటి నుంచి మహిళను అత్త మామ కొడుతూ హింసిస్తూ ఉండేవారు.  కొడుకే లేడు.. కోడలు మాకు అక్కర్లేదు అంటూ దేశానికి ఇంట్లో నుంచి బయటికి పంపించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను మహిళా కమిషన్ ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: