అలా చేయమన్న గర్ల్ ఫ్రెండ్.. ఉరివేసుకున్న యువకుడు?

praveen
ప్రేమంటే ఎన్నో మధుర జ్ఞాపకాలు కు కేరాఫ్ అడ్రస్ . ప్రేమలో కొనసాగుతున్న ఇద్దరూ ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోవాలి.. ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించుకోవాలి అలాంటప్పుడే ప్రేమ బంధం నిలబడుతూ ఉంటుంది. కానీ ఇటీవలి కాలంలో మాత్రం ప్రేమలో ఉన్న వారు ఒకరిపై ఒకరు డామినేషన్ చేయడానికి ఇష్టపడుతున్నారు తప్ప.. ఒకరి ఇష్టాలను మరొకరు అర్థం చేసుకోవడానికి గౌరవించడానికి ఆసక్తి చూపడం లేదు.  నేటి రోజుల్లోప్రేమ జంటలు ఎక్కువకాలం రిలేషన్ లో కొనసాగడం లేదు. చిన్న కారణాలకే బ్రేకప్ చెప్పుకుంటూ విడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

 అంతేకాదు ఇటీవల కాలంలో ప్రేమ కారణంగా ఎంతోమంది ఈ చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి కూడా ఏర్పడింది. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. సహజీవనం చేస్తున్న తన భాగస్వామి బీఫ్ తినాలని బలవంత పెట్టడం కారణంగా ఒక వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడుమ్ ఈ ఘటన గుజరాత్ లో వెలుగులోకి వచ్చింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ మహిళ మహిళ సోదరుడిపై కూడా కేసు పెట్టారు. గుజరాత్ లోని ఉడాన్ లో పటేల్ నగర్ లో చోటు చేసుకుంది. ఊడన్ ప్రాంతానికి చెందిన రాహుల్ సింగ్ తల్లి సోదరి తో కలిసి ఢిల్లీ వెళ్ళాడు.

 అక్కడ అతనికి ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారింది. ఆమెను పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాడు. ఇదే విషయాన్ని తల్లితో చెప్పాడు. కానీ తల్లి మాత్రం వారి పెళ్ళికి నిరాకరించింది. దీంతో ఇల్లు వదిలి సదరు అమ్మాయి తో సహజీవనం మొదలుపెట్టాడు రాహుల్. అయితే ఇక రాహుల్ ప్రియురాలు అతని సోదరుడు కూడా రాహుల్ ను బీఫ్ తినాలి అని ఒత్తిడి చేశారు. తాము చెప్పింది చేయకపోతే చంపేస్తామని బెదిరించారు. దీంతో మనస్తాపంతో  జరిగిన విషయాన్ని సూసైడ్ నోట్ లో రాసి చివరికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసు విచారణలో భాగంగా సూసైడ్ నోట్ బయటపడడంతో అసలు విషయం తెలిసింది. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: