సారీ అమ్మా నాన్న అంటూ.. కొడుకు చేసిన పనికి.. పేరెంట్స్ షాక్?

praveen
దీంతో ఇటీవల కాలంలో పెద్ద పెద్ద చదువులు చదివేందుకు సిద్ధమవుతున్న విద్యార్థుల ఆలోచనా తీరు అసలు ఎలా ఉంటుందో కూడా అర్థం కాని విధంగా మారిపోయింది. ఎందుకంటే చిన్న చిన్న సమస్యలకే భయపడిపోతూ అక్కడితో జీవితం ముగిసిపోయింది అని భావిస్తూ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు నేటి రోజుల్లో యువత. ఇక తమ పిల్లలు బాగా చదువుకుంటున్నారు అని ప్రయోజకులు అయిన తర్వాత తమను ఎంతో సంతోషంగా చూసుకుంటారని పిల్లల మీదే ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు అనే విషయం తెలిసిందే. ఇలా క్షణికావేశంలో ఏకంగా ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూ ఉన్నారు.

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అనే చెప్పాలి. ఇంటర్ చదువుతున్న విద్యార్థి చివరికి కఠిన నిర్ణయం తీసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా చిట్వేలు మండలం లో ఓ గ్రామానికి చెందిన విద్యార్థి హైదరాబాద్ నగరంలోని మాదాపూర్లో ఓ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే కొండాపూర్లోని హాస్టల్లో మరో ముగ్గురితో కలిసి ఉంటున్నాడు .

ఇకపోతే ఇటీవల యూసఫ్ గూడా లో ఉండే బంధువు ఇంటికి వెళ్ళాడు సదరు విద్యార్థి. ఇక ఆ తర్వాత రెండు రోజులు అక్కడే ఉండి మధ్యాహ్నం సమయంలో తిరిగి హాస్టల్ కి వచ్చాడు. ఇక ఆ తర్వాత గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. అయితే రూమ్మేట్ వచ్చి చూడగా లోపల గడియపెట్టి ఉంది. తాళాలు పగలగొట్టి చూడగా విద్యార్థి ఉరి వేసుకుని కనిపించాడు. గదిలో విద్యార్థులు రాసిన సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇన్ని రోజు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. ఇక మీద ఎవరు ఇబ్బంది పెట్టరు.. సారీ అమ్మా నాన్న అంటూ రాసి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: