వరుసకు చెల్లి.. అయినా ప్రేమ పెళ్లి.. కానీ చివరికి?

praveen
ఇటీవలి కాలంలో కేవలం 18 ఏళ్లు నిండిన వారిని మాత్రమే మేజర్లుగా ఇండియాలో పరిగణిస్తూ ఉంటారు. ఆ వయసు వచ్చిన తర్వాతే సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇటీవలి కాలంలో మాత్రం ప్రేమ దోమ అంటూ చిన్న వయసులోనే చెడుదారుల్లో వెళ్తున్నారు. నేటి రోజుల్లో అప్పుడప్పుడే ఎదుగుతున్న పిల్లలు ఇక ఈ లోకం మొత్తం మాకు దాసోహం అన్న విధంగా ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు.


 వెరసి ఆ తర్వాత మాత్రం అనాలోచిత నిర్ణయాల కారణంగా ఎన్నో ఊహించని సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నేటి రోజుల్లో తెలిసీ తెలియని వయసులో ఎదుగుతున్న పిల్లల్లో పడుతున్న ప్రేమలో ఎన్నో దారుణాలు ఘటనలకు కారణమవుతున్నాయ్. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఓ యువకుడు చేసిన తప్పు వల్ల అటు యువతి ఇటు యువకుడి ఇద్దరి జీవితాలు కూడా అయోమయం లో పడిపోయాయ్. వావివరుసలు మరిచిపోయిన యువతీయువకులు తమ జీవితాన్ని పాడు చేసుకోవడమే కాదు సభ్య సమాజంలో ఒక చెడ్డ పేరు మూటగట్టుకున్నారు.


 ఉత్తరప్రదేశ్లోని రామ్ పూర్ లో ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.  రాంపూర్ జిల్లా లోని గుహ్లీయా అనే ప్రాంతానికి చెందిన రవి పజాబాకు చెందిన రాజేశ్వరి అనే యువతిని ఇష్టపడ్డాడు. మూడేళ్లుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను వరసకు వీరిద్దరు కూడా అన్నా చెల్లెలు అవుతారు. ఇవన్నీ మర్చిపోయి ఇక ప్రేమలో మునిగి తేలి శారీరకంగా కలిసారూ. చివరికి బాలిక గర్భం దాల్చింది. దీంతో పెళ్లి చేసుకోవాలంటూ అతనిపై ఒత్తిడి తెచ్చింది. అతను మాత్రం పెళ్లికి ఒప్పుకోలేదు. చివరికి కుటుంబాలు కలగజేసుకుని పరిస్థితిని అర్థం చేసుకుని ఇద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించారు. కానీ  పెళ్ళైన మూడు గంటల్లోనే రాజేశ్వరి చనిపోయింది.దీంతో భర్త అత్తమామల పై  రాజేశ్వరి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: