ఆమెకు 66 ఏళ్లు.. సూసైడ్ చేసుకోవడానికి ఏం చేసిందో తెలుసా?

frame ఆమెకు 66 ఏళ్లు.. సూసైడ్ చేసుకోవడానికి ఏం చేసిందో తెలుసా?

praveen
ఇటీవలి కాలంలో మనుషుల తీరు ఎంత దారుణంగా మారిపోయింది అంటే  ఏ చిన్న సమస్య వచ్చినా చాలు పరిష్కారం ఒకటే ఆత్మహత్య అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు. ఈ క్రమంలోనే చిన్న చిన్న సమస్యలకు నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. మనిషి జీవితం అన్న తర్వాత సంతోషాలు సుఖాలూ కష్టాలు కూడా ఉంటాయి. అవకాశాలు వచ్చినప్పుడు పొంగిపోవడం కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవడం అసలు చేయకూడదు అని మానసిక నిపుణులు చెబుతుంటారు.  కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి వాటిని ఎదుర్కోవాలనీ అంటూ ఉంటారు.

 కానీ ఇటీవల కాలంలో మనుషుల్లో మాత్రం ఇలాంటి ధైర్యాన్ని ఎక్కడా కనిపించడం లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవలి కాలంలో అయితే ఎంతోమంది చనిపోవడానికి సులభమైన మార్గాలను కూడా ఎంచుకుంటూ ఉంటున్నారు. ఇటీవల కాలంలో సూసైడ్ చేసుకోవడానికి ఎంతోమంది ఎంచుకుంటున్న దారులు ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.ఆమె వయస్సు 66 ఏళ్లు. ఆ వయసులో కృష్ణ రామా అనుకుంటూ మనవళ్లు మనవరాళ్లతో ఎంతో సంతోషంగా ఉండాల్సిన వయసు.
 కానీ ఆ వయసులో ఆమెకు ఏం కష్టం వచ్చిందో చివరికి ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. ఆత్మహత్య చేసుకునేందుకు ఆమె చేసిన పని డాక్టర్లకు సైతం చెమటలు పట్టించింది. ఆత్మహత్య చేసుకోవడానికి 55 బ్యాటరీలను మింగేసింది వృద్ధురాలు. దీంతో ఆమెను హాస్పిటల్ కు తీసుకువెళ్లగా విసర్జన ద్వారా బయటకు వస్తాయని ఐదు రోజులు హాస్పటల్ లోనే ఉంచారు. కానీ వారం రోజుల్లో ఆమె శరీరం నుంచి కేవలం ఐదు బ్యాటరీలే బయటకి రావడంతో చివరికి గంటలకొద్దీ శ్రమించి ఆపరేషన్ నిర్వహించి మిగతా 52 బ్యాటరీలను బయటకు తీశారు. ఈ ఘటనకు సంచలనంగా మారిపోయింది. ఐర్లాండ్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: