తాను తెచ్చిన మంచూరియా తినలేదని.. చంపేశాడు?

praveen
నేటి సభ్య సమాజంలో బ్రతుకుతుంది మానవత్వం ఉన్న మనిషా లేకపోతే ఏకంగా మనుషులను చంపేసే క్రూర మృగమా అన్న డౌట్ ఎంతో మందిలో కలుగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ముక్కు ముఖం తెలియని వారికి ఏదైనా ఆపాయం కలిగితేనే అయ్యో పాపం అంటూ జాలిపడి మానవత్వాన్ని చూపించేవారు మనుషులు. కానీ ఇప్పుడు మాత్రం పరాయి వాళ్ళ విషయంలో జాలి పడటం దేవుడు ఎరుగు సొంత వాళ్ల విషయంలో కూడా కాస్తయినా జాలీ దయ చూపించడం లేదు మనుషులు.


 వెరసి నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఎన్నో ఘటనలు  సభ్య సమాజాన్ని ఉనికిపడేలా చేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చాక్లెట్ తిన్నంత  ఈజీగా మనిషి ప్రాణాలను గాల్లో కల్పిస్తున్నారు ఉన్మాదులుగా మారిపోతున్న మనుషులు. అంతేకాదు ఏకంగా సొంత వారి విషయంలో కూడా కాస్తయిన జాలి దయ చూపించకపోవడంతో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితి నేటి రోజుల్లో నెలకొంది అని చెప్పాలి. ఇక ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన గురించి తెలిస్తే మాత్రం సమాజంలో ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా అని ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటారు.



 ఏకంగా తాను తెచ్చిన మంచూరియా తినలేదు అన్న కారణంతో దారుణంగా ప్రాణాలు తీసేశాడు ఇక్కడ ఒక వ్యక్తి. 2016 లో ఈ ఘటన జరిగింది. బెంగళూరుకు చెందిన సంజయ్ తల్లి శశికళ అమ్మమ్మ శాంతకుమారితో కలిసి ఉండేవాడు. అయితే అమ్మమ్మ శాంతా కుమారి కోసం సంజయ్ మంచూరియా తీసుకువచ్చాడు. కానీ ఆమె తనకు ఇష్టం లేదంటూ కోపంతో విసిరికొట్టుంది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సంజయ్ కర్రతో కొట్టడంతో ఆమె చనిపోయింది. అయితే తల్లి, స్నేహితుడితో కలిసి ఆమె శవాన్ని గోడలో పూడ్చిపెట్టి ఎప్పటిలాగే రంగులు వేసి పారిపోయారు. అయితే తర్వాత సంవత్సరంలో స్థానికులు అనుమానం వచ్చి తాళాలు పగలగొట్టి చూస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను ఇటీవల పట్టుకున్నారు. ఇక వారిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: