భర్తకు చికెన్లో విషయం పెట్టిన భార్య.. అప్పటికి చనిపోకపోవడంతో?
ఈ ఘటన కర్నూలు జిల్లా తుగ్గలి మండలం బాటతాండాలో వెలుగులోకి వచ్చింది. ఈశ్వర్ నాయక్ ఉపాధి నిమిత్తం కుటుంబంతో సహా అనంతపురం జిల్లా గుత్తిలో నివాసం ఉండేవాడు. అటవీ శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో డ్రైవర్గా పనిచేస్తూ ఉండేవాడు. అయితే వృత్తి రీత్యా ఎక్కువగా ఇంట్లో కంటే బయటే ఉండేవాడు ఈశ్వర్. ఈ క్రమంలోనే భార్య ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసే కృష్ణయ్యతో వివాహేతర సంబంధానికి తెరలేపింది. ఇక ఎప్పటికైనా నిజం బయటపడాల్సిందే కదా. ఓ రోజు భర్తకు ఈ విషయం తెలిసింది.
ఇక ఇదే విషయంపై ఈశ్వర్ రమాదేవి దంపతుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. కృష్ణయ్యకు దూరంగా ఉండాలని సవ్యంగా నడుచుకోవాలి అంటూ హెచ్చరించాడు భర్త. అయితే భార్య తీరు మార్చుకోవాల్సింది పోయి.. ప్రియుడితో సుఖం కోసం కట్టుకున్న బంధాన్ని తెంచుకోవడానికి సిద్ధమైంది. ఇక భర్త హత్య కోసం ప్రియుడుతో కలిసి ప్లాన్ చేసింది. ఇక మద్యం సేవించి ఇంటికి వచ్చిన భర్త ఈశ్వర్ ని చికెన్ లో విషం కలిపి చంపడానికి ప్రయత్నించింది. అప్పటికి భర్త మృతి చెందకపోవడంతో మరోసారి హత్యయత్నం చేసింది.. రోకలి బండతో కొట్టింది. చివరికి బాత్రూంలో కాలుజారి పడ్డాడు అని కొత్త నాటకానికి తెరలేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.