ఛీ.. ఛీ.. లైవ్ లో బ్రతికున్న వ్యక్తిని.. పేపర్లలో చంపేశారు?
ఇలా ఆస్తిని కాజేయడం కోసం ఏకంగా బ్రతికున్న వారిని కూడా చనిపోయినట్లుగా ధ్రువీకరణ పత్రాలు సృష్టించి నేరాలకు పాల్పడుతూ ఉండడం అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంది అని చెప్పాలి. అనంతపురంలో కూడా ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఆస్తిపై కన్నేసిన దుర్మార్గులు ఒక వ్యక్తిని బతికుండగానే చనిపోయినట్లు రికార్డులు సృష్టించారు. చివరికి ఆస్తి కాజేయాలని ప్రయత్నించారు. కానీ చివరికి ప్లాన్ కాస్త రివర్స్ అయ్యింది అని చెప్పాలి. వివరాల్లోకి వెళితే.. అనంతపురం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీరాం నాయక్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు.
ఈ క్రమంలోనే కొంతమంది అక్రమార్కులు అతని ఇంటిని కాజేయాలని పక్కా ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే బ్రతికున్న శ్రీరాం నాయక్ మృతి చెందాడు అంటూ నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించారూ. ఈ క్రమంలోనే ఇంటిని తమ పేరుపైరిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. చివరికి ఈ విషయం శ్రీరామ్ నాయక్ కు తెలిసింది. దీంతో ఇదే విషయాన్ని అటు ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లి ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ క్రమంలోనే ఈ కేసులో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తుల పాత్రపై లోతుగా విచారణ జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనంగా మారింది..