వార్నీ.. పోలీస్ అయ్యుండి.. ఇదేం పని?

praveen
ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా దొంగలు బెడద కాస్త ఎక్కువైపోయింది అన్న విషయం తెలిసింది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని ఇక దొంగలు బెడద నుంచి కాస్త రక్షణ ఉండేలా చూసుకుంటున్నారు. అయితే అటు పోలీసులు సైతం దొంగతనాలకు సంబంధించిన కేసులను ఎంతో వేగంగా ఛేదిస్తూ ఇక దొంగల ముఠాలను అరెస్టు చేస్తూ బాధితులకు న్యాయం చేస్తున్నారు అని చెప్పాలి. అయితే సాధారణంగా పోలీసులు ఇలా దొంగలను పట్టుకోవడం మాత్రమే ఇప్పటివరకు చూసాం. కానీ కొంతమంది పోలీసులు వ్యవహరించే తీరు మాత్రం ఖాకీ చొక్కాకే మచ్చ తెచ్చే విధంగా ఉంటుంది.

 ఎందుకంటే దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే అక్రమాలకు పాల్పడటం ఏకంగా దొంగతనాలు చేయడం లాంటివి కూడా కొంతమంది చేస్తూ ఉంటారు అని చెప్పాలి.  ఇక్కడ ఒక పోలీస్ ఇలాంటిదే చేసి అందరిని అవ్వక్కయ్యేలా చేశాడు.  దొంగలను పట్టుకోవాల్సిన పోలీస్ కాస్త దొంగగా మారిపోయాడు. అదేదో పెద్ద బ్యాంకు లూటి చేశాడు అనుకోకండి. ఏకంగా ఒక కరెంటు బల్బును దొంగలించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజులో వెలుగు చూసింది. ఇక ఇందుకు సంబంధించిన ఫుటేజ్ మొత్తం సీసీ కెమెరాలు రికార్డు కావడంతో వెంటనే స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రాజేష్ వర్మ పూల్ పూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే రాత్రి సమయంలో ఒక దుకాణం బయట ఉన్న కరెంటు బల్బును కానిస్టేబుల్ దొంగతనం చేశాడు. బల్బును తీసి జోబులో వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే మరుసటి రోజు షాప్ వద్దకు వచ్చిన యజమాని బల్బు లేకపోవడంతో షాక్ అయ్యాడు. వెంటనే సీసీటీవీ గమనించాడు. ఒక పోలీసు బలుపు దొంగలించినట్లు చూసి మరింత అవాక్కయ్యాడు. ఇక వెంటనే వెళ్లి పోలీసులకు ఫిర్యాదుచేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి ఇక కానిస్టేబుల్ ను విధుల నుంచి సస్పెండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: