షాకింగ్ : దొంగతనానికి వచ్చి.. అక్కడే ఉరేసుకున్నాడు?

praveen
ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా దొంగల బెడద కాస్త ఎక్కువగానే పెరిగిపోయింది అని చెప్పాలి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రహస్యంగా ఇంట్లోకి చొరబడటం అందిన కాడికి దోచుకోవడం లాంటివి చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే కొంతమంది దొంగలు మాత్రం చివరికి పోలీసులకు పట్టుబడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక దొంగ మాత్రం ఎవరు ఊహించని పని చేశాడు. ఒక ఇంట్లో ఎవరు లేని సమయంలో చోరీ చేయడానికి వెళ్ళిన దొంగ చివరికి ఆ ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కృష్ణరాజపురంలోని ఇందిరా నగర పరిధిలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళ్తే.. సాఫ్ట్వేర్ఉద్యోగి ఇంట్లోకి చొరబడిన దిలీప్ బహదూర్ అనే వ్యక్తి ఇంటి మొత్తాన్ని గాలించాడు. కానీ అక్కడ నుంచి ఏమీ చోరీ చేయకుండా చివరికి ఆ ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరుసటి రోజు ఇంటికి వచ్చిన ఇంటి యజమాని విషయం గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు  ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఇక్కడ జరిగిన ఘటన గురించి తెలిసి అందరూ అవాక్కవుతున్నారు అని చెప్పాలి. ఇప్పటివరకు దొంగలు వచ్చి అందిన కాడికి దోచుక పోవడం మాత్రమే చూసాం.

 కానీ ఇలా దొంగతనానికి వచ్చిన వ్యక్తి ఏకంగా అదే ఇంట్లో తనువు చాలించి బలవన్మరణానికి పాల్పడటం గురించి మాత్రం మొదటిసారి వింటున్నాము అంటూ ఈ విషయం తెలిసినవారు ఎంతోమంది అనుకుంటున్నారట. ఇక ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇలా చోరీకి వచ్చిన దొంగ అక్కడ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయంపై అటు పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపడుతూ ఉన్నారు అని చెప్పాలి.  ఇక అనుమానాస్పద మృతిగా కూడా కేసు నమోదు చేసుకున్నారు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: