కోడిని బలివ్వాలనుకున్నాడు.. కానీ అతనే బలైపోయాడు?
తన అభిరుచులకు తగ్గట్లుగా నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నాడు. అయితే ఇటీవలే గృహప్రవేశ కార్యక్రమం జరగాల్సి ఉంది.. అయితే కొత్త ఇంట్లోకి వెళ్లే ముందు రక్త తర్పణం చేయడం మనం చూస్తూ ఉంటాం. ఎంతోమంది గృహప్రవేశం పూజ పూర్తయిన తర్వాత మేకను గాని కోడిని గాని బలిస్తూ ఉంటారు. లోకేష్ కోడిని కోయాలని నిర్ణయించాడు. ఇందుకోసం స్థానికంగా కూలీగా పనిచేసే రాజేంద్రన్ అనే వ్యక్తిని పురమయించాడు. ఇక అతను కోడిపుంజును తీసుకొని ఇంటికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే కోడిని బలిచ్చి రక్త తర్పణం చేసేందుకు ఒక్కడే మూడో అంతస్తుకు వెళ్ళాడు.
ఎంతసేపటికి రాకపోవడంతో లోకేష్ పైకి వెళ్లి చూడగా రాజేంద్రన్ కనిపించలేదు. కానీ కాసేపటి తర్వాత లిఫ్ట్ కోసం తీసిన గుంతలో రాజేంద్రన్ ని గుర్తించారు. అతని శరీరంపై కోడి నిలబడి ఉంది. అపస్మారక స్థితిలో ఉన్న రాజేంద్రన్ ను ఆసుపత్రికి తరలించిగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. అంటే కోడిని బలివ్వడానికి వెళ్లిన సదరు వ్యక్తి ఇలా బలివ్వడానికి ముందే ప్రాణాన్ని కోల్పోయాడు. మెట్ల మార్గం ద్వారా మూడంతస్తులకు వెళ్లిన అతను పొరపాటున లిఫ్ట్ ద్వారంలోకి వెళ్లి ఉంటాడని అక్కడ ఏమీ లేకపోవడంతో నేరుగా కిందపడి మరణించాడని ఇంటి యాజమని లోకేష్ తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.